ఇలాంటి మనుషులు కూడా వుంటారా.. ఓల్డ్ స్టూడెంట్ పై అమానుషం

0
976

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయింది. ఎంతో సంబరంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నాం. కానీ విద్యనేర్పి, సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన వారు అత్యంత హేయంగా ప్రవర్తించారు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ దారుణం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. విద్యా బుద్ధులు నేర్పే గురువు బుద్ధి గడ్డి తింది. పాతికేళ్ల క్రితం చదివిన స్కూల్ లో స్టడీ సర్టిఫికేట్ కోసం వచ్చిన పూర్వ విద్యార్థికి షాక్ తగిలింది.

ఆ పూర్వ విద్యార్ధిని పట్ల స్కూల్ హెడ్మాస్టర్, పీఈటీ అసభ్యంగా ప్రవర్తించారు. భోజన విరామ సమయంలో వచ్చిన ఆ పూర్వ విద్యార్ధినిని భోజనం చేసి వద్దామని చెప్పి కారులో హోటల్ కు తీసుకువెళ్లి అక్కడ భోజనం పార్శిల్ తీసుకొని మళ్ళీ కారులో ఎక్కించుకున్నారు. ఈ ఇద్దరు టీచర్లు పట్టణ శివారు ప్రాంతంలోకి వెళ్లి అక్కడ మద్యం సేవించి తమ వెంట తీసుకెళ్లిన గిరిజన మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఆ పూర్వ విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విస్మయం కలిగిస్తున్న ఈ ఘటనలో ఇద్దరు టీచర్ల పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.

స్టడీ సర్టిఫికెట్ కోసం వెళ్లిన పూర్వ విద్యార్థిని (28 ఏళ్ల మహిళ) పై అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, పీఈటీ జనార్దన్ రెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించారు.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి అర్భన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. రాయచోటి పట్టణం బంగ్లా సర్కిల్ సమీపంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 16 ఏళ్ల కిందట 10వ తరగతి పూర్తి చేసిన ఓ పూర్వ విద్యార్థిని ఈ నెల 8వ తేదీ పాఠశాలకు వెళ్లి స్టడీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారన్నారు. పత్రాలు ఇవ్వకుండా మధ్యాహ్నం అయిందని, భోజనం చేసి వద్దామంటూ విద్యార్థినిని కారులో తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారని సదరు విద్యార్థిని పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారన్నారు. ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, పీఈటీ జనార్ధన్ రెడ్డిలపై అసభ్య ప్రవర్తన, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు రాయచోటి అర్భన్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here