రాజన్న సిరిసిల్ల జిల్లా సోమ వారం సందర్భంగా వేములవాడ రాజన్న క్షేత్రం భక్తులతో సందడి నెలకొంది. సోమ వారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అప్పాల భీమశంకర్ శర్మ ఆధ్వర్యంలోని అర్చకులు శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారికి అభిషేకములు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతు షష్టి పూజలు పరివార దేవతార్చనలు వేదమంతాలతో ఆలయ అర్చకులు నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు సందర్భంగా భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి క్యూలైలలో బారులు తీరారు స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది ఈసందర్బాంగ భక్తులు స్వామివారి ప్రీతిపాత్రమైన కోడే మొక్కలు చెల్లించి స్వామివారికి అభిషేకములు, అన్న పూజలు అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. సెలవులు కావడంతో స్వంతూళ్ళకు వచ్చిన వారు రాజన్న క్షేత్రానికి రావడంతో సందడి నెలకొంది.