హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా.. కాస్త గ్యాప్ ఇచ్చి.. ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి.. వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.. వాహనదారులు.. ఓ వైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జామ్‌లతో నరకం చూస్తున్నారు.. అయితే, తెలంగాణలో వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు.. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం వార్నింగ్ ఇచ్చింది వాతావరణ శాఖ..
ఈ రోజు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సిద్ధిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది… ఇదే సమయంలో.. ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది వాతావరణశాఖ… రేపు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఇక, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. మరోవైపు.. ఈ నెల 10వ తేదీన ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది వాతావరణశాఖ.