2023 లో కొత్త జీవితం ప్రారంభిస్తున్నా.. హీరో మనోజ్

0
788

కొత్త ప్రాజెక్టులు, కొత్త సినిమాల‌తో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాన‌ని ప్ర‌క‌టించారు ప్ర‌ముఖ హీరో మంచు మ‌నోజ్‌. ఇంత‌కాలం తాను సినిమాల‌కు ఎందుకు దూర‌మ‌య్యాయో త‌న కొత్త మూవీ లాంచింగ్‌లో త‌న అభిమానుల‌కు, తెలుగు ప్రేక్ష‌కుల‌కు చెబుతాన‌న్నారు మ‌నోజ్. క‌డ‌ప న‌గ‌రంలోని ప్రాచీన అమీన్ పీర్ ద‌ర్గాను మంచు మ‌నోజ్ ద‌ర్శించుకున్నారు. ద‌ర్గా నిర్వాహ‌కులు ద‌ర్గా సంప్ర‌దాయం ప్ర‌కారం ఆయ‌న త‌ల‌పాగా చుట్టి ద‌ర్గాలో ద‌ర్శ‌నం క‌ల్పించారు.

ద‌ర్గా సాహెబ్‌కు, ఇత‌ర సాహెబ్‌ల‌కు మ‌జార్ల వ‌ద్ద పూల చాద‌ర్ స‌మ‌ర్పించి హీరో మ‌నోజ్ ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్గా విశిష్ట‌త‌ను నిర్వ‌హ‌కుల‌ను అడిగి తెలుకున్నారు. చాలా ఏళ్లుగా ద‌ర్గాను సంద‌ర్శించాల‌ని అనుకున్నా వీలు కాలేద‌ని, త‌న కుటుంబ స‌భ్యులు అంద‌రూ ద‌ర్గాకు వ‌చ్చాన‌ని, నేను ఎందుకు రాలేక‌పోయాలో అర్ధం కాలేదున్నారు. అంద‌రూ బాగుండాల‌ని, ప్ర‌తి ఒక్క‌రూ సంతోషంగా ఉండాల‌ని తాను భ‌గ‌వంతున్ని ద‌ర్గాలో ప్రార్థించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. త‌న మూవీ సక్సెస్ త‌రువాత మ‌ళ్లీ ద‌ర్గాను కుటుంబ స‌భ్యుల‌తో వ‌చ్చి ద‌ర్శించుకుంటాన‌ని మంచు మ‌నోజ్ చెప్పారు. గురువారం సూపర్ స్టార్ రజనీకాంత్, సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here