ఈ సినిమా అందరూ చూడాలి… శ్రీవిష్ణు

0
515

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. శ్రీవిష్ణు తాజా చిత్రం అల్లూరి. ఈ సినిమా చూసిన తర్వాత పోలీస్ శాఖపై అందరికీ గౌరవం పెరుగుతుందని అంటున్నారు. మనం రోడ్డుమీద వెళ్ళేటప్పుడు పోలీస్ కనబడితే సెల్యూట్ చేయాలనిపించే విధంగా సినిమా ఉంటుంది అని శ్రీవిష్ణు ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాలో చివరి 30 నిముషాలు గుండె పట్టుకోవల్సి వుంటుంది. 20 ఏళ్ల లైఫ్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నాం అన్నారు శ్రీవిష్ణు. ఈ సినిమాలో జరిగిన సంఘటనలన్నీ వాస్తవాలే, ఎలాంటి ఆర్బాటాలు లేవు. ప్రతి ఒక్కరూ అల్లూరి తప్పుకుండా చూడాల్సిన సినిమా. కరోనా సమయంలో పోలీసు వాళ్లు చేసిన సేవకు గుర్తింపుగా ఈ సినిమాను అంకితం ఇస్తున్నాం అన్నారు శ్రీవిష్ణు.

అల్లూరి సినిమాలో లుక్ డిఫరెంట్ గా వుంటుందన్నారు శ్రీవిష్ణు. ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకూ మాకు అనూహ్యమయిన స్పందన లభించింది. పోలీస్ వారిని అభినందించాలని టూర్ వేశాం. చాలామంది థియేటర్లలో టీజర్లు రిలీజ్ చేశాక చాలా బాగా ఆదరించారన్నారు శ్రీవిష్ణు. స్ర్కిప్ట్ లో చెప్పినవిధంగా మేం నటించాం. పోలీసులంటే గతంలో అంతగా అభిమానం వుండేది కాదు. కరోనా టైంలో వారు చేసిన సేవలు అమూల్యం. పోలీసుల్ని కలవడం ఆనందంగా వుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here