బిర్యానీ అడిగిన భార్య.. కిరోసిన్‌ పోసి నిప్పంటించిన భర్త

0
319

కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న విషయాల్లోనూ దంపతుల మధ్య గొడవలు వస్తుంటాయి.. ఆ చిన్నపాటి గొడవలే వారి బంధాన్ని మరింత దృఢంగా చేస్తాయని కూడా చెబుతుంటారు.. కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలకే పెద్ద ఘర్షణ జరిగిన సందర్భాలు ఉంటాయి.. ఎవరో ఒక్కరూ కూల్‌ అయితే గానీ.. అవి అక్కడితో ఆగవు.. ఎవరు క్షణికావేషానికి లోనైనా.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.. ప్రాణాలు కూడా తీసుకున్న సందర్భాలు ఎన్నో.. అయితే, తాజాగా చెన్నైలో బిర్యానీ విషయంలో వృద్ధ దంపతుల మధ్య వివాదం మొదలైంది.. దీంతో, ఆగ్రహంతో ఊగిపోయిన భర్త.. భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టాడు.. ఆ మంటలను తట్టుకోలేని మహిళ.. నేరుగా వెళ్లి భర్తను కౌగిలించుకోవడంతో.. ఇద్దరికీ మంటలు వ్యాపించాయి.. ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది ఆ వ్యవహారం.

తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై అయనవరం ఠాగూర్ నగర్‌లో కరుణాకరన్ (75) అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి, అతని భార్య పద్మావతి (66)తో కలిసి నివాసం ఉంటున్నాడు.. అయితే, గత రాత్రి ఇంటికి బిర్యానీ తెచ్చుకున్న కరుణాకరన్.. భార్యకు ఇవ్వకుండా తానే తినేశాడు.. కానీ, నాకెందుకు బిర్యానీ తీసుకురాలేదంటూ కరుణాకరన్ ప్రశ్నించింది భార్య పద్మావతి.. ఇక్కడే వివాదం మొదలైంది.. ఒక్కరోజు అయినా వంట బాగా చేశావా? అంటూ భార్యకు గొడవకు దిగాడు.. మాటామాట పెరిగింది.. ఆగ్రహంతో ఊగిపోయిన కరుణాకరన్‌.. భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.. ఆ మంటల్లో చిక్కుకుని అరుస్తూ.. భర్తను కౌగిలించుకుంది పద్మావతి.. ఓవైపు పొగలు.. మరోవైపు.. వృద్ధ దంపతుల అరుపులు విన్న స్థానికులు.. ఆ తర్వాత మంటలార్పి.. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందనే.. ఇప్పుడే ఏమీ చెప్పలేమంటున్నారు వైద్యులు.. మొత్తంగా బిర్యానీ విషయంలో తలెత్తిన వివాదం.. దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here