మోడీ రాక.. భారీ బందోబస్తు.. ఏర్పాట్లు పరిశీలించిన సీవీ ఆనంద్‌

0
893

బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్‌లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హాజరయ్యేందుకు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నారు. అయితే ప్రధాని మోడీ కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ మొత్తం 144 సెక్షన్‌ అమలులో ఉంది. తాజాగా హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మాట్లాడుతూ.. 3వ తేదీ రాత్రికి ప్రధాని మోదీ రాజ్ భవన్ లో బస చేయనున్నట్లు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో విజయ సంకల్ప సభ తర్వాత రాజ్ భవన్ లో ప్రధాని బస చేస్తారన్నారు. అయితే ఆయన బీజేపీ నేతలతో కలసి పరేడ్ గ్రౌండ్స్ లో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధాని బస సందర్భంగా రాజ్ భవన్ లో భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నామని సీవీ ఆనంద్‌ వెల్లడించారు. హెచ్ఐసీసీ, బేగంపేట, రాజ్ భవన్ మార్గాల్లో 4వేల మంది పోలీసులు పహారాలో ఉంటారని, జడ్, జడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న నాయకులు వస్తోన్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ సహా.. ‌‌కేంద్రమంత్రులు సభకు హాజరవుతారని, పరేడ్ గ్రౌండ్స్ లో లక్షమంది వరకు కూర్చునే అవకాశం ఉంటోందన్నారు. సభకు ప్రధాని మోదీ సహా.. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉందని, కంటోన్మెంట్, జీహెచ్ఎంసీ అధికారులు పార్కింగ్ స్థలాలు కేటాయించారన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఇతర జిల్లాల నుంచి అధికారులను పిలిపించామని, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో 3వేల మందితో పహారా సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, తెలంగాణ పోలీసులు బందోబస్త్ లో ఉంటారని, డీఐజీ, ఎస్పీ, ఏసీపీ స్థాయి అధికారులను సెక్టర్ ఇంఛార్జ్ లుగా నియమించామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here