వెస్టిండీస్ పర్యటనకు సీనియర్లు దూరం.. ధావన్‌కు కెప్టెన్సీ

0
678

ఐపీఎల్ తర్వాత టీమిండియా బిజీ బిజీగా మ్యాచ్‌లను ఆడుతోంది. ఇప్పటికే సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో వన్డేలు, టీ20 సిరీస్‌లను ఆడిన భారత్.. ఆ తర్వాత ఐర్లాండ్‌లో రెండు టీ20ల సిరీస్‌లో పాల్గొంది. ఇటు సీనియర్ల జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఓ టెస్టు ముగియగా గురువారం నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలలో ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడనుంది. ఇంగ్లండ్ పర్యటన ముగియగానే భారత్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో పాల్గొంటుంది. మూడు వన్డేల కోసం తాజాగా భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు.

బీజీ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, బుమ్రా, భువనేశ్వర్, హార్డిక్ పాండ్యా వంటి ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించారు. దీంతో వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా నియమించారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. శిఖర్ ధావన్‌ ఈ ఏడాది టీమిండియాకు నాయకత్వం వహించే 8వ కెప్టెన్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో సౌతాఫ్రికాతో టెస్టులకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహించగా వన్డేలకు కేఎల్ రాహుల్ కెప్టెన్సీ అందించాడు. సొంతగడ్డపై శ్రీలంక, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లకు రోహిత్ శర్మ పగ్గాలు అందుకున్నాడు. అనంతరం సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు రిషబ్ పంత్ నాయకత్వం వహించాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు హార్డిక్ పాండ్యా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టగా.. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌కు బుమ్రా పగ్గాలు అందుకున్నాడు. అటు ఇంగ్లండ్‌లో రెండు టీ20ల వార్మప్ గేమ్స్‌కు దినేష్ కార్తీక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు వెస్టిండీస్‌ టూర్‌కు ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

భారత జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here