హీరో అంటూ పలకరించిన మంత్రులు.. పంచ్‌లేసిన బాలయ్య

0
132

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి.. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలోనూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగడం.. స్పీకర్‌ వారిని సస్పెండ్‌ చేయడం జరిగిపోయాయి.. మరోవైపు.. ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సన్నివేశాలు జరిగాయి. టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ మధ్య సరదా సంభాషణలు సాగాయి. ఏం హీరోగారు అంటూ బాలయ్యని పలకరించారు బొత్స . అటు గుడివాడ అమర్నాథ్.. బాలయ్యతో సరదాగా మాట్లాడారు. ఇవాళ కోటు వేసుకు రాలేదంటూ మంత్రి అమర్నాథ్ ఉద్దేశించి బాలయ్య జోకులేశారు.

అటు టీడీపీ నేతలతో బాలకృష్ణ చిట్ చాట్ చేశారు. తాజా రాజకీయాలు, రహదారుల పరిస్థితులపై చర్చించారు. అమరావతిలో దెబ్బతిన్న రోడ్లని చూస్తే బాధిస్తుందన్నారు. అసెంబ్లీకి వస్తుంటే చుట్టుపక్కల రహదారుల్ని పరిశీలించానని వారితో బాలయ్య చెప్పారు. భూములు ఇచ్చిన రైతులు పోరాటాలు చేయాల్సి రావడం బాధగా ఉందన్నారు. విశాఖలో జరిగిన 13 లక్షల కోట్ల ఒప్పందాలపై టీడీపీ నేతలతో బాలకృష్ణ చర్చించారు. ఒప్పందాల్లో విశ్వసనీయత ఎంత అని,ఎన్ని సంస్థలు స్థాపించేవి అని ఆయన ప్రస్తావించారు. మరోవైపు.. నందమూరి బాలకృష్ణ సొంతూరులో సందడి చేశారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలంతా సస్పెండ్‌ అయ్యారు. దీంతో… సొంతూరయిన నిమ్మకూరు వెళ్లారు బాలకృష్ణ. బంధువులను కలిసి కాసేపు సరదాగా గడిపారు. గ్రామంలోని వారిని పలకరించి… కాసేపు అందరితో మాట్లాడారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయారు బాలకృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here