మంత్రి మల్లారెడ్డి కేసులో ఐటీ అధికారుల దూకుడు.. మరో 10 మందికి నోటీసులు

0
1081

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.. రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించారు.. ఆ తర్వాత విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు అధికారులు.. అయితే, ఈ కేసులో ఐటీ మరింత దూకుడు పెంచింది.. మల్లారెడ్డి ఐటీ కేసులో మరికొందరికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.. తాజాగా, మరో పదిమందికి సమన్లు జారీ అయ్యాయి.. విచారణకు హాజరుకావాలని 10 మందికి ఐటీ అధికారుల సమన్లు పంపారు.. ఇవాళ్టి విచారణలో సేకరించిన సమాచారం ఆధారంగా 10 మందికి సమన్లు జారీ చేశారు.. డిసెంబర్ 5వ తేదీ వరకూ పలువురిని వరుసగా విచారించనున్నారు.. విచారణలో ప్రధానం మెడికల్ సీట్ల కేటాయింపుపైనే దృష్టి సారించారు ఐటీ అధికారులు.. రేపు మంత్రి మల్లారెడ్డి తరుఫున ఆడిటర్‌ విచారణకు హాజరుకాబోతున్నారు.

తొలిరోజు ఐదు గంటల పాటు విచారణ సాగింది.. భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేశారు ఐటీ అధికారులు.. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల సీట్లు కేటాయింపులు, ఫీజు వసూలుపై వివరాలు సమర్పించాలని ఆదేశించారు.. ఐటీ అధికారులు ఇచ్చిన ఫార్మట్‌లోనే వివరాలు సమర్పించాలని ఆదేశించడంతో అదే ఫాలో అయ్యారు.. ఇక, తొలిరోజు విచారణపై మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ మేం సమాధానాలు చెప్పాం.. ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు కేటాయింపులపై విచారణ చేశారు. అవసరమనుకుంటే మరోసారి విచారణకు రావాలని ఐటి అధికారులు సూచించారని.. తమ ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలపై విచారణ చేశారన్నారు.. మేం చెప్పిన సమాధానాలతో ఐటీ అధికారులు సంతృప్తి చెందిఉంటారని తాను భావిస్తున్నానని వెల్లడించారు.

మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది అంటున్నారు మర్రి రాజశేఖర్‌రెడ్డి.. ఇదే కేసులో మరి కొంతమందికి సమాన్లు ఇచ్చి విచారణ చేస్తామని ఐటి అధికారులు తెలిపారు.. ఐటి అధికారుల విచారణకు మేము పూర్తిగా సహకరిస్తామన్నారు.. మరోవైపు.. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇచ్చామని వెల్లడించారు మంత్రి మల్లారెడ్డి కుమారుడు చామకూర భద్రారెడ్డి.. మాతోపాటు కళాశాలల ప్రిన్సిపాల్ మరికొంత మా సిబ్బందిని విచారణ చేశారు.. మా స్టేట్‌మెంట్‌తో పాటు మా కళాశాల సిబ్బంది స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు.. అవసరమనుకుంటే మరోసారి విచారణకు పిలుస్తామని తెలిపారు.. ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల ఫీజుల వివరాలు సీట్ల కేటాయింపు వివరాలు సమర్పించాలని అధికారులు కోరారు.. మేం చెప్పిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెంది ఉన్నారని అనుకుంటున్నట్టు తెలిపారు భద్రారెడ్డి. మొత్తంగా తొలిరోజు విచారణ ముగిసింది.. ఈ కేసులో నోటీసులు, విచారణ ఉత్కంఠరేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here