మంత్రి మల్లారెడ్డి టార్గెట్.. ఉదయం నుంచి ఐటీ సోదాలు

0
1035

మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా ఆయన కొడుకులు, అల్లుడు, సోదరుడి ఇంటిపై ఐటీ శాఖ కొరడా ఝుళిపించింది. హైదరాబాద్ లోని పలువురు రాజకీయనేతలు, వ్యాపారవేత్తలపై ఐటీ శాఖ ఫోకస్ పెట్టింది. తాజాగా మంత్రి చామకూర మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లా రెడ్డి కాలేజీల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి జిల్లాలలో 50 చోట్ల ఐటీ శాఖ తనిఖీలు సాగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి పై ఐటీ శాఖ మెరుపు దాడులు సంచలనంగా మారాయి. మంత్రి మల్లారెడ్డి కూతురు, కొడుకు, అల్లుళ్ళ నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాలపై సోదాలు కొనసాగుతున్నాయి. 50 టీమ్స్ సహాయంతో ఐటీ అధికారులు సోదాలు చేయడం కలకలం రేపింది.

మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు సాగుతున్నాయి. కొంపల్లిలోని విల్లాలో నివాసం ఉంటున్నారు మహేందర్ రెడ్డి. మైసమ్మగూడ, మేడ్చల్ ప్రాంతాల్లో విస్తరించి వున్న మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ సోదాలు సాగుతున్నట్టు తెలుస్తోంది. మల్లా రెడ్డి యూనివర్సిటీ ,మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలో సోదాలు చేస్తున్నారు ఐటీ శాఖ అధికారులు. పలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా పెట్టుబడి పెట్టారు రాజశేఖర్ రెడ్డి, మహేందర్ రెడ్డి.. కాలేజీలు రియల్ ఎస్టేట్ రంగాల్లో మొత్తాన్ని కూడా డైరెక్టర్ గా ఉన్నారు మల్లారెడ్డి అల్లుడు, కుమారుడు. అల్లుడు ప్రస్తుతం టర్కీలో వున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ భవన్ లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మహమూద్ అలీ, పలువురు ఎమ్మెల్యేల భేటీ… మంత్రి మల్లా రెడ్డిపై ఐటీ సోదాల నేపథ్యంలో నేతల భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here