జగన్ కీలక నిర్ణయం.. రెవిన్యూ డివిజన్ గా చింతూరు

0
785

జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక పాలనలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పాలనా వికేంద్రీకరణలో మూడు రాజధానులకు ప్రాధాన్యత ఇస్తున్న జగన్ ఇటీవల కొత్తగా జిల్లాలను ఏర్పాటుచేశారు. రెవిన్యూ మండలాలను పెంచి సామాన్యులకు రెవిన్యూ వ్యవస్థను మరింత దగ్గరగా చేర్చారు. తాజాగా జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో కొత్తగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని నాలుగు మండలాలతో కలిపి చింతూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ఈ రెవిన్యూ డివిజన్ లో ఏటిపాక, చింతూరు, కూనవరం, వర రామచంద్రాపురం మండలాలు వుంటాయి,. చింతూరు రెవెన్యూ మండలం ఏర్పాటుచేస్తూ ఈమేరకు ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా (Praksam District) అతి పెద్ద జిల్లాగా మారింది. ఏపీకి పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖ రాష్ట్రంలోనే అతి చిన్న జిల్లా అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here