మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌పై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ సెటైర్లు వేశారు. బెజవాడ బ్రహ్మానందం వెల్లంపల్లి శ్రీనివాస్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. ప్రజారాజ్యం విలీనానికి వెలంపల్లి లాంటి స్వార్ధ పరులే కారణమని పోతిన మహేష్ ఆరోపించారు. పదవుల కోసం చిరంజీవిని బలి పశువును చేశారన్నారు. శ్రీనివాస్ నువ్వు కూడా నాకు సలహాలు చెప్పేవాడివా అని చిరంజీవి అన్నారని.. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ విలీనాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారని స్పష్టం చేశారు. వెల్లంపల్లి లాంటి కోవర్టులా తమ పవన్ కళ్యాణ్‌ను విమర్శించేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు దమ్ముంటే.. అతని తండ్రి ఎలా చనిపోయాడో చెప్పాలన్నారు. అమర్నాథ్ తండ్రి మరణం వెనుకున్న కారణాలు ఏమిటో చెప్పాలని పోతిన మహేష్ సూటిగా ప్రశ్నించారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా అమర్నాథ్ వ్యాపారమని ఆరోపించారు. మంత్రి పదవి పోయాక కొడాలి నానికి మతి భ్రమించిందని.. అతని మానసిక పరిస్థితిని ఒకసారి చెక్ చేయించుకోవాలని హితవు పలికారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనే పిలుపు ఇవ్వగానే వైసీపీ పెద్దలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని పోతిన మహేష్ కౌంటర్ ఇచ్చారు. మూడేళ్లల్లో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ సామాజిక న్యాయం పాటించలేదన్నారు. తమ అధినేతను తిట్టడానికే సామాజిక న్యాయం పాటిస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలలో ఓటమి తప్పదని జగన్ బ్యాచ్‌కు అర్ధమైందని.. వచ్చే ఎన్నికలలో జగన్‌కు పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతారన్నారు. జేపీ వెంచర్స్, జే-బ్రాండ్స్ నుంచి జగన్ కోట్ల రూపాయల మామూళ్లు తీసుకుంటున్నారని విమర్శలు చేశారు.వైసీపీలో కొంత మంది నాయకులు వ్యభిచారులుగా మారారని మండిపడ్డారు. సన్నీ లియోన్ ను కూడా మించిపోయి నటిస్తున్నారని.. నాదెండ్ల మనోహర్‌ను లక్ష్యంగా చేసుకుని కుల విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోసారి నోరు జారితే వైసీపీ నేతల నాలుక కోస్తామని పోతిన మహేష్ హెచ్చరించారు. మైన్, శాండ్, వైన్ మాఫియాలతో జగన్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు. చీప్ లిక్కర్ అమ్ముకునే చీప్ గాళ్లతో కూడా తాము మాటలు పడాల్సి వస్తుందన్నారు.వైసీపీ మహిళలు వాళ్ల గౌరవాన్ని వాళ్లే తగ్గించుకుంటున్నారని.. జగన్ తన పార్టీలోని మహిళలను రాజకీయంగా బలి చేస్తున్నాడని ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టు్కుని లక్ష కోట్లు జగన్ దోచుకున్నాడన్నారు. ఇప్పుడు ఆయనే అధికారంలో ఉండి ఐదు లక్షల కోట్లు దోచాడని విమర్శించారు. ఆస్తి మీద ఆశ లేకపోతే సొంత చెల్లెలిని పక్క రాష్ట్రానికి పంపిస్తాడా అని జనసేన పోతిన మహేష్ ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు దమ్ము, ధైర్యం ఉంటే ప్రత్యేక హోదా, విభజన హామీలు కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. కేంద్రాన్ని నిలదీస్తామన్న జగన్.. అక్కడకెళ్లి వంగి వంగి దండాలు పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దుష్ట చతుష్టయం అంటే.. జగన్, సజ్జల, విజయసాయి రెడ్డి, భారతిలే అన్నారు. వాటాలు వేసుకుని ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారన్నారు. వైసీపీ పాలిట కాలయముడు పవన్ కళ్యాణ్ అన్నారు. జోగి రమేష్ ఒక జోకర్ రమేష్ అన్నారు. ఓట్లేయకపోతే సంక్షేమ పథకాలు రద్దు చేస్తారా అని పోతిన మహేష్ నిలదీశారు.