భూమికి అతి దగ్గరగా బృహస్పతి.. ఆరోజే మిస్ కాకండి

0
623

ఖగోళ శాస్త్రం అంతుచిక్కని రహస్యాల గని. గ్రహాలు, గ్రహణాలు.. చిత్ర విచిత్రాలు అద్భుతాల సమాహారం. సెప్టెంబర్ 26కి ఓ ప్రత్యేకత వుంది.. ఆరోజు ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కావద్దు.. ఎందుకంటే బృహస్పతి 70 సంవత్సరాలలో భూమికి అత్యంత సమీపంగా చేరుకునే రోజు. సెప్టెంబరు 26న ఈ అద్భుతమైన వీక్షణకు ఆలవాలం కానుంది. బృహస్పతి ప్రతి 13 నెలలకు ఇలా కనిపిస్తుంది. కానీ అది అందరికీ కనిపించదు. సంవత్సరంలో ఇతర సమయం కంటే పెద్దదిదా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. కానీ అదంత కాదు. “భూమికి బృహస్పతి దగ్గరగా రావడం చాలా అరుదుగా ఉంటుంది, అంటే ఈ సంవత్సరం ఈ అసాధరాణ వీక్షణ సాక్షాత్కరించనుంది. దీనిపై నాసా శాస్త్రవేత్తలు ఒక ప్రకటన విడుదల చేశారు.

బృహస్పతి భూమి నుండి సుమారు 365 మిలియన్ మైళ్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం భూమి నుండి దాదాపు 600 మిలియన్ మైళ్ల దూరంలో దాని సుదూర బిందువు వద్ద ఉంది. “మంచి బైనాక్యులర్‌లతో చూస్తే ఈ అద్భుతం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బృహస్పతి యొక్క గ్రేట్ రెడ్ స్పాట్ బ్యాండ్‌లను మరింత వివరంగా చూడటానికి ఒక పెద్ద టెలిస్కోప్‌ అవసరం వుంది. నాలుగు అంగుళాల లేదా అంతకంటే పెద్ద టెలిస్కోప్, ఆకుపచ్చ నుండి నీలం రంగులో ఉన్న కొన్ని ఫిల్టర్‌లు బృహస్పతి యొక్క కదలికలను చూడడానికి ఉపయోగపడతాయంటున్నారు సైంటిస్టులు.

ఆరు సంవత్సరాలుగా బృహస్పతి చుట్టూ తిరుగుతున్న నాసా యొక్క జూనో అంతరిక్ష నౌక, గ్రహం యొక్క ఉపరితలం మరియు దాని చంద్రులను అన్వేషించడానికి ప్రయత్నం చేస్తోంది. శాస్త్రవేత్తలు బృహస్పతిని అధ్యయనం చేయడం వల్ల సౌర వ్యవస్థ ఏర్పడటానికి సంబంధించిన పురోగతి ఆవిష్కరణలకు దారితీస్తుందని భావిస్తున్నారు. నిజానికి హిందూ సంప్రదాయం ప్రకారం సెప్టెంబర్ 26వ తేదీకి విశిష్టత వుంది. దేవీనవరాత్రులు ఈరోజే ప్రారంభం అవుతాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here