కేశినేని నానికి చిన్ని కౌంటర్‌.. లైట్‌..!

0
1221

కేశినేని బ్రదర్స్‌ వ్యవహారం ఆ మధ్య ఏపీ రాజకీయాల్లో.. ముఖ్యంగా బెజవాడ పాలిటిక్స్‌లో హీట్‌ పెంచింది.. అయితే, ఈ మధ్య ఓవైపు ఇతర పార్టీల నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూనే.. పార్టీ అధిష్టానంపై సంచల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు ఎంపీ కేశినేని నాని.. నాకు ఎవరూ సీటు ఇవ్వాల్సి అవసరం లేదు.. పోటీ చేస్తే గెలుస్తానని చెప్పుకొచ్చిన ఆయన.. అంతే కాదు.. కొన్ని నియోజకవర్గాల్లో ఎవరికి సీటు కేటాయించాలి అనే విషయంలోనూ హాట్‌ కామెంట్లు చేశారు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేశినేని చిన్నితో పాటు మరో ముగ్గురిని మినహాయించి టీడీపీ తరపున పోటీ చేసే ఏ అభ్యర్థికైనా తాను మద్దతిస్తానని స్పష్టం చేశారు. కేవలం ఎన్నికలు ఉన్నప్పుడే ప్రజాసేవకు ముందుకు వస్తానని, ధన కర్ణుడిగా పోజులిస్తున్నాడంటూ నాని తన సోదరుడు కేశినేని చిన్నిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. నిజాయితీగా రాజకీయాలు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. నా కాంపౌండ్‌లోకి ఏ అవినీతిపరుడినీ రానివ్వను. అలాంటి వారి నుంచి దూరం పాటిస్తున్నాను అని అన్నారు. అయితే, అన్న కేశినేని నాని వ్యాఖ్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, నాని తమ్ముడు కేశినేని చిన్ని.. ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నడుస్తాం.. పార్టీ కోసం శ్రమిస్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ జీవితం మాకూ.. అందరికీ ఆదర్శం అన్నారు.. కానీ, గొల్లపూడిలో పార్టీ కార్యాలయం విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదని మండిపడ్డారు.

ఇక, కేశినేని నాని కామెంట్లపై స్పందించిన కేశినేని చిన్ని.. లైట్‌ తీసుకొండి అంటూనే కౌంటర్‌ ఇచ్చారు.. పార్టీ ఎవరికి టికెట్‌ ఇస్తే వారికి సహకరిస్తానని ప్రకటించారు.. టీడీపీ అధిష్టానం.. కేశినేని నానికి టికెట్‌ ఇచ్చినా నా మద్దతు ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. 2014 ఎన్నికల్లో కేశినేని నానికి తెర వెనుకుండి పని చేశాను.. గెలుపు కోసం కృషి చేశాను.. 2019 ఎన్నికల్లో నానితో విబేధాల కారణంగా పని చేయకున్నా.. పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదన్నారు.. అయితే, కేశినేని నాని చేసిన కామెంట్లను నేను పట్టించుకోనని కొట్టిపారేశారు.. సేవా కాక్యక్రమాలు ఎవరు చేసినా మంచిదేనన్న ఆయన.. అన్న క్యాంటీన్లల్లో పేదలు భోజనం చేస్తారు.. కానీ, డబ్బున్న వారు భోజనం చేస్తారా..? అని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లల్లో నేను భోజనం చేస్తున్నానని నేనేమన్నా చెప్పానా..? అని నిలదీశారు.. పార్టీ బలోపేతం కోసం పని చేయడం.. పేదలకు సేవ చేయడమే నాకు తెలుసని స్పష్టం చేశారు కేశినేని చిన్ని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here