ఆసియా కప్‌లో భాగంగా బుధవారం భారత్ – హాంకాంగ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఈ మ్యాచ్‌లో 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది భారత్… ఇక 193 పరుగుల భారీ టార్గెట్ తో చేజింగ్ కు దిగిన హాంకాంగ్, ఏమాత్రం నిలకడగా ఆడలేకపోయింది. భారత బౌలర్ల ధాటిగా బంతులు విసిరి, బ్యాటర్లను కంట్రోల్ చేశారు. ఐదు వికెట్లు కోల్పోయిన హాంకాంగ్, 20 ఓవర్లల 152 పరుగులు చేసింది. దీంతో 40 పరుగుల తేడాతో హాంకాంగ్ పై విజయం సాధించింది టీంఇండియా. అయితే, మ్యాచ్ ఓడినా.. ఓ మగువ మనుసు మాత్రం ఇట్టే కొల్లగొట్లాడు.. హాంకాంగ్ క్రికెటర్.. స్టేడియంలోనే తన గాళ్ ఫ్రెండ్‌కు ప్రపోజ్ చేయడం.. ఆమె ఆనందంతో మనోడిని కౌగిలించుకోవడం.. ఆ దృశ్యాలు కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో.. ఒక్కసారిగా ఫోకస్ మొత్తం ఆ కొత్త లవ్ జంటపైకి మారిపోయింది.
హాంకాంగ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కించిత్ షా స్టేడియంలో తన ప్రేయసికి ప్రపోజ్ చేసి ఆమెను సంభ్రమాశ్చర్యాల్లో ముంచేశాడు.. ముంబైలో పుట్టిన కించిత్ మూడు నెలల వయసులో తల్లిదండ్రులతో కలిసి హాంకాంగ్ వెళ్లిపోయాడు. తండ్రి క్రికెట్ ఆడుతుండడాన్ని చూసి పదేళ్ల వయసులోనే బ్యాట్ పట్టాడు. ఇక, బుధవారం రోజు భారత్ విజయం సాధించిన తర్వాత స్టేడియంలోనే ఉన్న తన గాళ్ ఫ్రెండ్ వద్దకు వెళ్లాడు కించిత్.. ఆమె ముందు మోకాళ్లపై కూర్చుని ఉంగరం తీసి పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఉంగరం చూపించి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తున్న కించిత్‌ను చూసి పట్టరాని ఆనందంలో మునిగిపోయిన అతడి ప్రేయసి.. మొదట ఆశ్చర్యానికి లోనైంది.. ఆ తర్వాత తేరుకుని వెంటనే తన అంగీకారాన్ని చెప్పేసింది.. ఎస్.. అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. ఆ వెంటనే రింగ్‌ను ఆమె ఫింగర్‌కు తొడగడం.. ఇద్దరూ కౌగిలించుకుని ఆనందంలో మునిగిపోవడం జరిగిపోయాయి.. ఇక, ప్రేక్షకులు తమ కెమెరాలు, సెల్‌ఫోన్లకు పనిచెప్పారు.. ఆ దృశ్యాలను మొబైన్లలో బంధించారు.. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది.
అయితే, భారత్ చేతిలో హాంకాంగ్ 40 పరుగుల తేడాతో పరాజయం పాలైనప్పటికీ, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ ఘటన ఆసక్తికరంగా మారింది… భారత్‌పై హాంకాంగ్ పోరాడిన తీరును అంతా ప్రశంసించగా.. వారు తమ జట్టు మరియు దేశానికి ఆటను చాలా గుర్తుండిపోయేలా చేశారు.. ఈ మ్యాచ్‌లో 193 పరుగుల ఛేదనలో, 26 ఏళ్ల కించిత్.. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసి 28 బంతుల్లో 30 పరుగులు చేశాడు. రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. అతని స్కోరింగ్ రేటును పెంచే ప్రయత్నంలో, 18వ ఓవర్‌లో భువనేశ్వర్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.. ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తన కెరీర్‌లో ఇప్పటివరకు 43 టీ20లు ఆడి 20.42 సగటుతో 633 పరుగులు చేశాడు. టీ20ల్లో అతని అత్యధిక స్కోరు 79, అతను 2019లో ఐర్లాండ్‌పై స్కోర్ చేశాడు. ఇక, బౌలింగ్ వేసి తన కెరీల్‌లో 11 వికెట్లు కూడా సాధించాడు. ఇప్పుడు.. ప్రపంచంలోనే అద్భుతమైన స్టేడియాల్లో ఒకటిగా పేరున్న దుబాయ్ స్టేడియంలో.. తన ప్రేయసికి ప్రపోజ్ చేసి.. ఒప్పించాడు..