నాగుపాము- ముంగీస ఫైటింగ్‌ గురించి మీకు తెలుసా..?

0
474

నాగుపాము పేరు చెబితేనే అంతా వణికిపోతారు.. ఆ పాము కాటు వేసిందంటే.. ఇక కాటికే అంటారు.. అంతేకాదండోయ్.. అది పగకూడా పడుతుందని.. దానికి హాని తలపెట్టినవారిని వెంటపడి.. వెంబడింది కాటేస్తుందనే ప్రచారం కూడా ఉంది.. తనకు హాని తలపెట్టినవారి పేరు విన్నా.. గొంతు విన్నా.. ఎక్కడున్నా.. అక్కడ ప్రత్యక్షమై పగ తీర్చుకుంటుందట.. ఇక, ఈ విషపూరితమైన నాగుపామును.. నాగదేవతగా కూడా పూజిస్తుంటారు.. అయితే, నాగుపాముతోనూ ఫైటింగ్‌ చేసే జీవి ఒకటి ఉంది.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు చాలా మంది చూసేఉంటారు కూడా.. ముంగీస…. ఆ రెండు ఎదురుపడ్డాయంటే చాలు.. పెద్ద యుద్ధమే.. చివరకు నాగుపాము ముంగీస ముక్కలు ముక్కలు చేస్తుందని.. ఆ తర్వాత పరుగు పరుగున వెళ్లి.. ఓ మొక్కను తింటుంది.. అది ఏంటో కనిపెడితే చాలు.. నాగుపాము విషయానికి విరుగుడు దొరికినట్టే అని కూడా పెద్దలు చెప్పేమాటా.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. నాగుపాము-ముంగీస తలపడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది..

ఇప్పటికే పాములు, ముంగీసలు కొట్లాడే వీడియోలు చూసే ఉంటారు. ఇప్పుడు మరో వీడియోను వైల్డ్‌ యానిమలియా ఖాతాలో పోస్ట్‌ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారింది. నీటి మడుగులో ఉన్న నాగు పామును చూసిన ముంగీస దానిపై దాడికి ప్రయత్నించింది. పాము సైతం బుసలు కొడుతూ.. ముంగీసను కాటువేసే ప్రయత్నం చేస్తూనే.. అక్కడిని తప్పించుకోవాలని కూడా చూసింది.. కానీ, పాము ఎంత ప్రయత్నించినా ముంగీస మాత్రం వెంటాడుతూనే ఉంది.. పాము నీటి మడుగులో ఉన్నా.. దాని చుట్టూ తిరిగుతూ దాడి చేస్తూనే పోయింది.. అయితే ఈ పోరులో చివరకు విజయం ఎవరిని వరించింది? అనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు.. ఎందుకంటే.. ఆ వీడియోలో పూర్తిస్థాయిలో లేదు.. అప్పటి వరకు జరిగిన నాగుపాము-ముంగీస ఫైటింగ్‌ను చూస్తే మాత్రం.. ముంగీసే పైచేయి సాధించిందని చెప్పాలి.. మొత్తంగా నెట్టింటో ఈ వీడియో వైరల్‌గా మారిపోయింది.. 7 రోజుల క్రితం విండ్ యానిమాలియా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా భాగస్వామ్యం చేయబడిన ఈ వీడియోకు “ముంగూస్ వర్సెస్ కోబ్రా” అనే శీర్షిక పెట్టారు..

ఇక, ఆ వీడియో షేర్ చేయబడినప్పటి నుండి, 2 లక్షలకు పైగా వ్యూస్‌ సాధించింది.. 13,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ ఫైట్‌ని చూసి ఆశ్చర్యపోతున్నారు.. ఫన్నీ కామెంట్లు కూడా పెడుతున్నారు.. “ఇంతకు ముందు నేను నాగుపామును చూసి.. ఇంత నెమ్మదిగా ఉందని అనుకోలేదు! వావ్! ముంగూస్.. జోక్ కాదు.” అని ఓ వ్యక్తి కామెంట్ పెడితే.. “నాగుపాము డైవ్ చేయడం మరియు తన శ్వాసను బిగించి పట్టుకోవడం నేర్చుకోవాలి. ముంగీస సాధారణంగా ఈ ఎన్‌కౌంటర్స్‌లో గెలుస్తుంది” అని మరొకరు రాశారు. ఇక, కొంతమంది వినియోగదారులు దీనిని “రికీ టిక్కీ తవి” అనే కథనంతో కూడా పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here