ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక రాష్ట్రాలు కావాలంటూ ఇటీవల ఏపీకి చెందిన కొందరు నేతలు చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. వేర్పాటువాద ధోరణితో ఎవరైనా మాట్లాడితే తనలాంటి తీవ్రవాదిని ఇంకోసారి చూడరని హెచ్చరించారు. అవినీతిలో మునిగిపోయిన, పబ్లిక్ పాలసీ తెలియని మీరు రాష్ట్రా న్ని విడగొట్టేస్తారా.. మేం చూస్తూ కూర్చొంటామా? దేశభక్తులం. ఇంకొక్కసారి ఏపీని విడగొడతామంటే.. తోలు తీసి కింద కూర్చోబెడతాం అంటూ ధ్వజమెత్తారు.. అయితే, పవన్ కల్యాణ్ కామెంట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పవన్ కల్యాణ్ తీవ్రవాది అయితే కాల్చి పడేస్తారు.. రోడ్డు పక్కన కుక్కను కాల్చినట్లుగా కాల్చేస్తారని.. తీవ్రవాది అయితే ఏం చేస్తాడు? వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని అడిగితే పవన్ ప్రజలను చంపేస్తాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ గళాన్ని వినిపించటానికి రోడ్డెక్కే ప్రజలను పవన్ కల్యాణ్ తీవ్రవాది అయి ఏం చేస్తాడు? అని నిలదీశారు కొడాలి నాని.. రాష్ట్రం ముక్కలు కాకుండా ఉండటానికే మూడు ప్రాంతాల అభివృద్ధి విధానం తీసుకున్నామని స్పష్టం చేశారు.. రాష్ట్ర విభజనకు వత్తాసు పలికిన పార్టీల చంక ఎందుకు ఎక్కాడు? అని ప్రశ్నించారు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం లక్షల కోట్లు తెచ్చి అమరావతిలోనే పెడతాం అంటున్నారు.. రేపు ఈ ప్రాంతంలో ఉన్న నా లాంటి వాళ్ళు పొమ్మంటే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. హైదరాబాద్ నుంచి ఎందుకు రావాల్సి వచ్చిందని మండిపడ్డారు.. పవన్ కల్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు.. మాకు 55 శాతం ఓటు బ్యాంకు ఉంది.. అందరూ కట్ట కట్టుకొని వచ్చినా వెంట్రుక కూడా పీకలేరని.. బతికి ఉన్నంత కాలం ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్‌రెడ్డియే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు.. అభివృద్ధి అంటే స్విమ్మింగ్ పూల్ లో ఫారిన్ అమ్మాయిలను పెట్టుకుని మందు తాగటమా? అంటూ సెటైర్లు వేశారు.. గుడివాడలో క్యాసినో ఉందని రాష్ట్రపతి నుంచి ఈడీ వరకు అందరికీ లేఖలు రాశారు? ఏమయ్యింది? ఎవరైనా నా చిటికెన వేలు వెంట్రుక అయినా పీక గలిగారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. చంద్రబాబు ఒక 420, లోకేష్ 120.. పాదయాత్రలే కాదు.. పొర్లు యాత్రలు చేసినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని..