చంద్రబాబు చవట దద్దమ్మ.. మా బొచ్చు కూడా పీకలేడు- కొడాలి నాని

0
1263

గుడివాడలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. పేర్ని నాని తన గురువు అని.. పిల్లల చదువు కోసం చంద్రబాబు ఐదేళ్ళ హయాంలో 5 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. మూడేళ్లలో పిల్లల చదువు కోసం రూ.25 వేల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక నాయకుడు జగన్ అని కీర్తించారు. చంద్రబాబు, లోకేష్ 420 గాళ్ళు అని.. పేద పిల్లల కోసం మూడేళ్ళలో 16 మెడికల్‌ కాలేజీలు కడుతుంటే ఈ గుడ్డి వాళ్లకు అభివృద్ధి కనిపించటం లేదట అంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టి ఇస్తుంటే తుప్పు గాళ్ళకు కనిపించటం లేదని కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ వారసుడిగా జగన్ బీసీ, వెనుకబడిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చారని.. ఇచ్చామంటే ఇచ్చాం అని కాకుండా కీలక శాఖలను వెనుకబడిన వర్గాలకు సీఎం ఇచ్చారని ప్రశంసలు కురిపించారు. అంత దమ్ముంటే టీడీపీ ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. చంద్రబాబు చవట దద్దమ్మ అని.. మమ్మల్ని చంద్రబాబు ఓడిస్తాడట అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తమ బొచ్చు కూడా పీకలేరన్నారు. 2019లో దత్త పుత్రుడిని రెండు చోట్ల తుక్కు తుక్కుగా ఓడించామన్నారు. చంద్రబాబు తన సొంత కుమారుడిని కూడా గెలిపించుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. 2024లో గుడివాడలో మళ్లీ తానే గెలుస్తానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here