సినీ దర్శకుడు దశరథ్ రాసిన ‘కథారచన’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాదులోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కంటెంట్ ఉన్న సినిమా దేశం అంతా అడుతున్నప్పుడు కంటెంట్ ఉన్న నాయకుడు ఎందుకు హిట్ కాడు..? అని ఆయన వ్యాఖ్యానించారు. మేము కూడా పాన్ ఇండియా కి వెళ్తున్నామని కేటీఆర్ తెలిపారు. నాకు సినిమాతో పాటు క్రియేటివ్ కంటెంట్ అంటే ఇష్టమని ఆయన వెల్లడించారు. నేను రోజు 11, 12 పేపర్లు చదువుతా.. అలాగే మంచి బుక్స్ కనపడిన చదువుతా.. అమెరికాలో మాక్ డేమిన్ వాళ్ళు రాసిన స్క్రీన్ ప్లే బుక్ ను చదివానని వివరించారు.
అయితే.. తెర వెనుక ఉన్న టెక్నీషియన్స్‌కు ఆ బుక్ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. కేసీఆర్ కరోనా టైం లో మాట్లాడేటప్పుడు అందరూ టీవీలకు అతుక్కుపోయేవారని, మన సినీ పరిశ్రమని సౌత్ హబ్ గా తీర్చి దిద్దాలి అనేది మా ప్రయత్నమన్నారు కేటీఆర్. చిత్ర పరిశ్రమలో అజ్ఞాతయోధులు ఎంతో మంది ఉంటారని, వక్తల ఉపన్యాసం వెనుక ఎంతో విషయ పరిజ్ఞానం ఉంటుందని తెలిపారు. కరోనా పంక్షోభం వేళ సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూసేవారని, అందరికీ అర్థమయ్యేలా సులభ శైలిలో చెప్పడం కేసీఆర్ ప్రత్యేకత అని వివరించారు కేటీఆర్.