ఇది నల్లగొండ కాదు.. ఎర్రగొండ-కూనంనేని

0
686

చండూరు సభలో సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. వేలాదిమంది రక్తతర్పణంతో ఎరుపెక్కిన కొండ.. ఎర్రగొండ… రావి నారాయణ రెడ్డి నెహ్రౌగారి కంటే ఎక్కువ మెజారిటీతో గెలిచిన గడ్డ నల్లగొండ జిల్లా. ఎంతోమంది ధర్మమూర్తుల అడుగులతో పవిత్రమయిన గడ్డ ఇది. ఎన్నో ఉద్యమాలకు పురిటిగడ్డ. మునుగోడులో ఎవరికి ఓటేయాలో ఆలోచించుకోవాలి. రాజగోపాల్ రెడ్డిలా పార్టీలు మారిన వారు లేరు. పోరాట చరిత్రకు ప్రతీక అయిన కమ్యూనిస్టు పార్టీపై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. రాజగోపాల్ రెడ్డికి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచించాలి. మనల్ని మోసగాళ్ళు అంటారా? అన్నారు.

బండి సంజయ్ దొంగ ప్రమాణాలు చేయవద్దు.. తప్పుడు ప్రమాణాలు చేస్తే నరసింహస్వామి పేగులు తీసి మెడలో వేసుకుంటారు.. స్వాములకు ఫార్మ్ హౌస్ లో ఏమి పని ? ఫార్మ్ హౌస్ లో ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చిన పీఠాధిపతి తరపున బండి సంజయ్ ప్రమాణం చేస్తారు…ఇది తెలంగాణ…మోడీ ,అమిత్ షా మీ ఆటలు సాగవన్నారు కూనంనేని సాంబశివరావు.

సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం బీజేపీపై నిప్పులు చెరిగారు. మునుగోడులో ఎన్నికలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఏడాది తర్వాత ఎన్నికలు రావాలి. రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఏం చెబుతున్నాడు.. నియోజకవర్గ అభివృద్ధికి రాజీనామా చేశానని చెబుతున్నారు. వాస్తవం ఏంటి? తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ గడ్డిగా అన్నాడట వెనకటికి ఎవడో.. తాడిచెట్టు ఎక్కితే దూడ గడ్డి దొరుకుతుందా? అన్నారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం.రాజగోపాల్ రెడ్డివి కుంటిసాకులు.. ఉప ఎన్నికలు వస్తే బీజేపీ పోటీకి వస్తుందని రాజగోపాల్ రెడ్డిని రంగంలోకి దింపారు. 22 వేల కోట్లు కాదు.. 18వేల కోట్లు కాంట్రాక్ట్ కోసం బీజేపీకి అమ్ముడుపోయానని చెప్పినట్టే కాదు. బీజేపీలో నేను ఇప్పుడు చేరానని అనుకుంటున్నారు.. కానీ నేను 3 సంవత్పరాల ముందునుంచే బీజేపీతో టచ్ లో వున్నానన్నారు. ఉన్న మొగుడికి విడాకులు ఇవ్వకుండానే బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నానని చెబుతున్నారు. నమ్మకద్రోహుల్ని ఓడించాలన్నారు వీరభద్రం.

మునుగోడు ప్రజానీకం నన్ను గెలిపించాలి. మీ సేవకుడిగా మీకు అందుబాటులో వుంటా.. అభివృద్ధికి పాటుపడతా.. నేను మట్టిబిడ్డను. గులాబీ జెండా ఎగరేసి నన్ను ఆశీర్వదించండి. కారు గుర్తుకు ఓటేయండి అన్నారు మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here