గ్రామీణ ప్రాంతాలలో విజృంభిస్తుంది లంపీ వైరస్. మద్దికేర మండలం పత్తికొండ మండలాలలో పశువులకు సోకింది లంపీ వైరస్. జిల్లా వ్యాప్తంగా లంపీ వైరస్ వ్యాధి చాప కింద నీరులా విజృంభిస్తున్న వ్యాధి. పశువులకు వైరస్ సోకడంతో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. ఆందోళనలో పశుపోషకులు. సంత మార్కెట్లో పశువులు విక్రయాలు చేయకూడదని కలెక్టర్ ఆదేశాలు ఉన్న, మార్కెట్ సమీపంలోనే పశువులు క్రయవిక్రయాలు జరుగుతున్న వ్యాపారస్తులు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవడం లేదు అధికారులు.
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం పరిధిలోని తుగ్గలి, మద్దికేర, పత్తికొండ మండలాలలోని పలు గ్రామాలలో పశువులకు లంపీ వైరస్ సోకడం పశువులను పోషిస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. పశువులకు ముందు జాగ్రత్తగా టీకాలు వేసి నివారణ చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్న పశు శాఖ అధికారులు. లంపీ వైరస్ పశువులకు ఒక దాని నుండి మరొక పశువులకు వైరస్ తొందరగా సోకుతుందని పశువులు సంత లో పశువుల క్రయవిక్రయాలు జరగకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఉన్న పట్టించుకోని పశువుల వ్యాపారస్తులు. వ్యవసాయం మార్కెట్ యార్డ్ పశువుల క్రయవిక్రయాలు జరగకుండా అధికారులకు జారీ చేశారు.
వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో ప్రైవేటు స్థలంలో పశువులు సంత జరుగుతున్న పట్టించుకోని అధికారులు. పశువులు గుంపులుగా చేరకుండా, పశువుల సంతలు జరపకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వాలు అధికారుల పైన ఉన్న పట్టించుకోని అధికారులు. పశువులను దూరంగా దూరంగా కట్టివుంచి రైతులు పశువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని పశువుల సంచాలకులు అన్నారు ప్రస్తుతం మూడు మండలాలలో లంపి స్కిన్ వైరస్ సోకిందని ఎనిమిది పశువులకు ఈ వైరస్ చోకడంతో అప్రమత్తమై పశువులకు టీకాలు ఇచ్చామని పశువుల సంచాకులు డాక్టర్ రవి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ లంపి స్కిన్ వైరస్ అనేది పెద్ద ప్రమాదకరమైన వ్యాధి కాదని పశువులకు మంచి పోషక ఆహార ఇస్తే ఈ వైరస్ అనేది రాదని వ్యాధి నిరోధక శక్తి లేని పశువులకు మాత్రం ఈ వ్యాధి సోకుతుందని డాక్టర్ రవి ప్రకాష్ రెడ్డి అన్నారు. లంపి స్కిన్ అనే వ్యాధి ప్రాణాంతక వ్యాధి కాదని రవి ప్రకాష్ రెడ్డి అంటున్నారు.