తెలంగాణలో ఒక మహిళా వేదికలు..

0
1534

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతు వేదికలను ప్రారంభించింది.. మండల కేంద్రాల్లో రైతులు సమావేశమై.. వారి సమస్యలు, పంటలు, రైతుబంధు.. ఇలా అనేక విషయాలను చర్చించుకునేందుకు వీలుగా ఈ వేదికలు నిర్మించింది ప్రభుత్వం.. ఇక, రైతు వేదికల వలె మహిళా వేదికలు కూడా నిర్మించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఈ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు.. రాష్ట్రంలో మహిళలను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు రైతు వేదికల మాదరిగా మహిళా వేదికలు నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. నాబార్డు, ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సమాఖ్య, ఎనబుల్ సంస్థలు కలిసి అత్యుత్తంగా పనిచేస్తున్న స్వయం సహాయక సంఘాలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం, అభివృద్ధి, భద్రతకు సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించారు.

ఇక, స్వయం సహాయక బృందాల్లో షూరిటీ లేకుండా 3 లక్షల రుణాలు తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తు చనిపోతే వారి రుణాలను మాఫీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు మంత్రి ఎర్రబెల్లి.. మూడు లక్షల రుణం తీసుకుని కొంత చెల్లించిన తర్వాత చనిపోతే, చెల్లించిన మొత్తాన్ని పూర్తిగా వారి కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు ప్రకటించారు.. రుణాలు తీసుకున్న మహిళలు చనిపోతే రుణం మాఫీ.. బీమాగా వర్తింపజేస్తామన్న ఆయన.. అభయ హస్తం కింద చెల్లించిన 500 డిపాజిట్లను వడ్డీతో సహా త్వరలో చెల్లిస్తామని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here