విమానాల్లో ఇక మాస్క్‌ తప్పనిసరి కాదు.. కానీ..!

0
540

ఎక్కడికి వెళ్లినా మాస్క్‌.. ఎక్కడ చూసినా మాస్క్‌ ఉంటేనే ఎంట్రీ బోర్డులు.. అయితే, ఈ పరిస్థితి చాలా వరకు మారినా.. ఇంకా విమానాల్లో ఈ నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటి వరకు, విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాస్కులు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించడం తప్పనిసరి.. కానీ, ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. ఎందుకంటే.. విమాన ప్రయాణంలో మాస్క్‌ల వాడకం తప్పనిసరి కాదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.. అయితే, కరోనావైరస్ కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ప్రయాణికులు వాటిని ఉపయోగించడమే బెటర్‌ అనే సందేశాన్ని మాత్రం ఇచ్చింది. కాగా, కరోనా ఎంట్రీ తర్వాత.. కనిపించమని ఆ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకు విమానాలతో పాటు.. పబ్లిక్‌ ప్లేస్‌లలోనూ మాస్క్‌ తప్పనిసరి చేసింది ప్రభుత్వం.. అయినా.. చాలా మంది ధరించారు.. కొంతమంది ధరించకపోవడంతో ఫైన్‌ తప్పలేదు.. ఆ తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత కొందరు అలవాటుపడినవారు మాస్క్‌ ధరిస్తూనే ఉన్నారు.. కానీ, చాలా మంది వాటికి దూరంగానే ఉంటున్నారు.

విమానాల్లో పరిస్థితి వేరుగా ఉంది.. ఇప్పటి వరకు, విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాస్కులు లేదా ఫేస్ కవర్లు ఉపయోగించడం తప్పనిసరి కాగా.. ఇక, తప్పనిసరి కాదంటోంది కేంద్రం.. షెడ్యూల్ చేయబడిన ఎయిర్‌లైన్స్‌కు కమ్యూనికేషన్‌లో, కోవిడ్‌ 19 నిర్వహణ ప్రతిస్పందనకు గ్రేడెడ్ విధానం యొక్క ప్రభుత్వ విధానానికి అనుగుణంగా తాజా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రా విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇకపై విమానంలో కోవిడ్‌ 19 వల్ల కలిగే ముప్పు దృష్ట్యా, ప్రయాణీకులందరూ మాస్క్/ఫేస్ కవర్లను ఉపయోగించాలని మాత్రమే పేర్కొంది. విమానంలో ప్రకటనల భాగంగా జరిమానా/శిక్ష చర్యలకు సంబంధించిన ఏదైనా నిర్దిష్ట సూచనలు చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. కాగా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. తాజా అధికారిక డేటా ప్రకారం, దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కోవిడ్‌ కేసుల్లో 0.02 శాతంగా మాత్రమే ఉన్నాయి.. ఇక, రికవరీ రేటు 98.79 శాతానికి పెరిగింది. వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,28,580కి పెరిగింది.. మరణాల రేటు ఇప్పటి వరకు 1.19 శాతంగా నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here