డబ్బులుంటే దాచుకో.. నేలకేసి కొట్టాలా? మహిళను అమనించాలా?

0
663

డబ్బు కొన్నిసార్లు మనిషిలో ఎక్కడలేని అహంకారం పెంచుతుంది.. బిలియనీర్లు అయినా.. కొందరు సాటి మనిషిని మనిషిగా ప్రేమిస్తారు, గౌరవిస్తారు.. కొందరు మాత్రం డబ్బు మదంతో విర్రవీగుతారు.. అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ఆ వీడియో ప్రకారం.. మెర్సిడెజ్‌ బెంజ్‌కారులో వచ్చిన ఓ వ్యక్తి పెట్రోల్‌ బంక్‌కు వెళ్లాడు.. తన కారులో ఇంధనం పోయించుకున్నాడు.. ఆ తర్వాత బంక్‌లో ఉన్న సదరు మహిళా.. కారు ఓనర్‌ దగ్గరకు వెళ్లి డబ్బులు అడిగింది.. దీంతో.. ఆమె చేతికి డబ్బు ఇవ్వకుండా నేలకేసి విసిరికొట్టాడు. కానీ, ఆ మహిళ మాత్రం సహనం కోల్పోకుండా.. నిదానంగా.. ఆ కరెన్సీ నోట్లను ఒక్కొక్కటిగా ఏరి తన బ్యాగ్‌లో వేసుకుంది.. అప్పడికే కారు ముందుకు కదిలిపోగా.. ఆ మహిళ మాత్రం బాధను కళ్లు తుడుచుకున్నట్టుగా కనిపిస్తోంది..

మొత్తంగా చైనాలోని గ్యాస్ స్టేషన్ ఉద్యోగి పట్ల కారు యజమాని అమర్యాదగా ప్రవర్తించిన తీరు ఇంటర్నెట్‌లో దుమారం రేపింది. రెడ్‌డిట్‌లో పంచుకున్న వీడియోలో ఒక లగ్జరీ కారు యజమాని గ్యాస్ స్టేషన్‌లో ఇంధనం నింపిన తర్వాత కారు డోర్‌ నుంచి డబ్బు విసిరి, సిబ్బందికి కన్నీళ్లు పెట్టించాడు.. ”గ్యాస్ స్టేషన్ వర్కర్ కోసం డబ్బును నేలపై విసిరేయడం” అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయడంతో.. వైరల్‌గా మారిపోయింది.. 50 సెకన్ల ఆ క్లిప్‌లో బ్లాక్ మెర్సిడెస్ కారు ఇంధనం నింపుకోవడానికి గ్యాస్ స్టేషన్‌లోకి ప్రవేశించడాన్ని చూడవచ్చు. మహిళా అటెండర్ కారులో పెట్రోలు నింపడం గమనించవచ్చు, ఆ తర్వాత ఆమె యజమానిని డబ్బులు అడగడం.. ఆమెకు డబ్బును గౌరవంగా ఇవ్వడానికి బదులుగా, యజమాని కొన్ని నోట్లను నేలమీద విసిరేయడం.. కారు స్టేషన్ నుండి బయలుదేరిన తర్వాత ఆమె నోట్లను తీసుకున్నప్పటికీ, ఆమె అవమానంగా భావించి కన్నీళ్లు పెట్టుకోవడం.. ఇప్పుడు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది..

ఆ క్లిప్‌ను చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. కారు యజమాని, అతని అసభ్య ప్రవర్తనపై విమర్శలు గుప్పించారు. అన్ని గ్యాస్ స్టేషన్లలో కారు ప్రవేశాన్ని నిషేధించాలని కొందరు అధికారులను కోరారు. ఒక వినియోగదారు ఈ సంఘటనపై స్పందిస్తూ, ” ఇది చాలా నిరుత్సాహకరం. ఆమె కన్నీళ్లు తుడుచుకోవడం చూసి.. ప్రజలు ఎవరితోనైనా ఇలా ప్రవర్తిస్తూ ఎలా జీవిస్తారు?’’ అని మరొకరు వ్యాఖ్యానించారు, ‘‘తమ కంటే తక్కువ అదృష్టవంతుల పట్ల వారు ఎలా ప్రవర్తిస్తారో చూస్తే వారి నిజ స్వభావాన్ని ఇది తెలియజేస్తుంది. మరోవ్యక్తి.. ”ఎందుకు? ప్రజలు నీచంగా ఎందుకు ఉండాలి? కారణం లేదు! ఇది మంచిగా ఉండటానికి ఏమీ ఖర్చు కాదుకదా? అని రాసుకురాగా.. ”కర్మ ఇలాంటి వ్యక్తులను పట్టిస్తుందని నేను నమ్ముతున్నాను.. ఈ మహిళ ఏమి చేస్తుందో ఎవరికి తెలుసు. నేను ఆమెను కౌగిలించుకోవాలనుకుంటున్నాను, ఇది బాధిస్తుందనగా.. మరో వ్యక్తి.. ‘కర్మ ఇలాంటి వ్యక్తులను పట్టిస్తుందని నేను నమ్ముతున్నాను.. ఈ మహిళ ఏమి చేస్తుందో ఎవరికి తెలుసు. నేను ఆమెను కౌగిలించుకోవాలనుకుంటున్నాను, ఈ ఘటన బాధిస్తోంది అని.. ఇలా అనేక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here