ప్రభుత్వం వద్ద నిధుల్లేకుంటే.. మమ్మల్ని రసగుల్లాల్లా తినేస్తారా? వ్యాపారుల ఆవేదన

0
1138

ప్రభుత్వం వద్ద నిధుల్లేకుంటే.. మమ్మల్ని రసగుల్లాల్లా తినేస్తారా? అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎదుట తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఓ వ్యాపారవేత్త.. పదే పదే ఎందుకు మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారస్తులు… మంత్రి బుగ్గన సమక్షంలో ట్రేడ్ అడ్వైయిజరీ కమిటీ సమావేశం జరిగింది… అయితే, ఈ సమావేశంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు పలువురు వ్యాపారస్తులు.. అధికారులు వ్యాపారులతో పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఫిర్యాదు చేశారు… పదే పదే ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారో అర్థం కావడంలేదంటూ ఆవేదన వెలిబుచ్చారు.. ప్రభుత్వం వద్ద నిధుల్లేవని కొందరు అధికారులు చెబుతున్నారన్న ఓ గ్రానైట్ వ్యాపారి.. ప్రభుత్వం వద్ద నిధుల్లేకుంటే.. మమ్మల్ని రసగుల్లాల్లా తినేస్తారా? అంటూ మంత్రి బుగ్గన ఎదుటే తన గోడు వెల్లబోసుకున్నారు. వ్యాపారాలు చేసే సత్తా ఉన్న తాము.. పన్నులు కట్టలేమా..? అంటూ మరో ప్రశ్న సంధించారు.. తమను కొందరు అధికారులు తప్పుడు దృష్టితో చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వ్యాపారులు.. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కోరారు వ్యాపారస్తులు. అయితే, అందరి గోడును విన్న మంత్రి బుగ్గన.. వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టని విధంగానే పన్నుల విధానం ఉంటుందని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here