ఎక్కడ చూసినా ఉద్యోగుల తొలగింపు వార్తలే.. ముఖ్యంగా టెక్ కంపెనీలు పోటీపడి మరీ ఉద్యోగులను తొలగిస్తున్నాయా? అనే రీతిలో ఉంది వ్యవహారం.. పేరు మోసిన టెక్ కంపెనీల నుంచి చిన్న కంపెనీల్లోనూ ఇదే తీరు ఉంది.. అయితే.. ఓ ఉద్యోగిని మాత్రం.. ఏ మాత్రం పనిచేయకుండానే దాదాపు కోటిన్నర రూపాయాలు జీతంగా అందుకుంది.. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ప్రకటించింది.. తాను ఏ పని చేయకుండా రూ.1.5 కోట్ల జీతం తీసుకున్నాను అంటూ.. ఫేస్‌బుక్ యాజమాన్య సంస్థ మెటాకు చెందిన ఓ మాజీ ఉద్యోగి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. టెక్ సంస్థల్లో ఉద్యోగం అంటేనే.. జీతం ఎక్కువగా ఉన్నా ఒత్తిడి కూడా అదే స్థాయిలో ఉంటుంది.. కానీ, కోటిన్నర జీతం తీసుకుని.. ఎలాంటి పనిచేయడం లేదంటూ ఓ మహిళ చెప్పడంతో.. టెక్కీలు కుల్లుకునేలా చేస్తోంది.
ఇంతకీ, ఎవరా? మహిళ.. ఎందుకు ఆమె ఎలాంటి పనిచేయకుండానే కోటిన్నర జీతం అందుకుంది? అసలు అంత జీతం ఇచ్చి ఆ సంస్థ ఎందుకు ఆమెను ఖాళీగా కూర్చొబెట్టింది అనే వివరాల్లోకి వెళ్తే.. మెటా కంపెనీలో రిక్రూటర్‌గా పనిచేశారు మాడెలిన్ మచాడో.. 2021లో మెటా కంపెనీలో తన 6 నెలల ఉద్యోగ అనుభవాన్ని టిక్‌టాక్ వీడియోలో వెల్లడించింది ఆమె.. రిక్రూటర్‌గా పని చేసిన తాను ఒక్కరినీ కూడా రిక్రూట్ చేయలేదని చెప్పుకొచ్చింది.. అదేంటి అనుకుంటున్నారా? అయితే, ఆ సమయంలో కంపెనీకి ఎలాంటి రిక్రూట్‌మెంట్ ఆలోచనే లేకపోవడమేనట.. మొత్తంగా తాను ఏ పనీ చేయకుండా సంవత్సరానికి 1,90,000 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 1.5 కోట్లు జీతం అందుకున్నట్టు వెల్లడించింది.. తన ఉద్యోగ సమయం మొత్తం మెటా కంపెనీలో నేర్చుకోవడంలోనే గడిచిపోయేదన్న మాఎ.. ఆ సంస్థలో కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి శిక్షణ ఉన్నతస్థాయిలో ఇస్తారని చెప్పుకొచ్చారు.
మొదటి ఆరు నెలలు, మొదటి సంవత్సరం కూడా మేం ఎవరినీ నియమించుకుంటామని ఊహించలేదు. అది నిజంగా నా మనసును కదిలించింది. పర్ఫెక్ట్‌గా, నేను దీన్ని ఒక సంవత్సరం పాటు రైడ్ చేయబోతున్నాను, స్పష్టంగా నేను దీన్ని చేయలేదు, అని ఆమె వీడియోలో పేర్కొంది. మెటా “అత్యుత్తమ ఆన్‌బోర్డింగ్ మరియు శిక్షణ” విధానాలను “చాలా క్షుణ్ణంగా” కలిగి ఉందని జోడించి, తన రోజును “లెర్నింగ్”తో నింపినట్లు మ్యాడీ వివరించింది. అయితే, పని చేయకుండానే జీతం తీసుకున్నానంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.. దీంతో కొన్ని రోజుల తర్వాత దీనిపై వివరణ ఇస్తూ లింక్డ్‌ఇన్‌లో ఆమె పోస్ట్ చేశారు. తాను టిక్‌టాక్‌లో పెట్టిన వీడియో తప్పు కోణంలో వైరల్ అయ్యిందని.. తన ఉద్దేశం వేరు అని వివరంగా చెప్పుకొచ్చారు.. అయితే, ఇటీవల, Meta రెండవ రౌండ్ సామూహిక తొలగింపులను ప్రకటించింది. పరిశ్రమలో తీవ్ర ఆర్థిక మాంద్యం ఏర్పడినందున 10,000 ఉద్యోగాలను తొలగిస్తామని చెప్పింది. విస్తృతంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాల కోతలు విస్తృత పునర్నిర్మాణంలో భాగంగా ఉన్నాయి.