హైదరాబాద్‌తో పాటు విశ్వనగరం చుట్టూ ఉన్న ప్రాంతాలకు కూడా గుడ్‌న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర నిర్మించనున్న మెట్రో పనులకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ పోలీసు అకాడమీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం.. వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీఎంఆర్ నిధులతో పనులు ప్రారంభిస్తున్నాం అన్నారు.. ఇక, హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రావాల్సి ఉందన్నారు.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్‌ను విస్తరించనున్నట్టు ప్రకటించారు.. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించినా.. లేకున్నా.. రాష్ట్రప్రభుత్వమే పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
మన హైదరాబాద్ సుప్రసిద్ధమైన నగరం.. చెన్నై కంటే దేశంలోని ఇతర అనేక నగరాల కంటే ముందుగా అంటే 1912లోనే ఎలక్ట్రిసిటీ వచ్చిన సిటీ.. మనకు 1912లో కరెంట్ వస్తే చెన్నై నగరానికి 1927లో అక్కడ కరెంట్ వచ్చిందని తెలిపారు కేసీఆర్.. చరిత్రలో నిజమైన కాస్మోపాలిటన్ సిటీగా అన్ని వర్గాలను, కులాలను, మతాలను, ప్రాంతాలను, జాతులను అందర్నీ అక్కున చేర్చుకున్న విశ్వనగరం.. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ కోసం మెట్రోకు శంకుస్థాపనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు కేసీఆర్.. అన్ని భాషలు, సంస్కృతులు కలిగిన ఉన్నవారు హైదరాబాద్‌లో ఉన్నారు. అనేక రాష్ట్రాలు, దేశాల నుంచి ఈ నగరంలో సహజీవనం సాగిస్తున్న సంగతి తెలుసు. అయితే, సమైక్య పాలకుల వల్ల చాలా బాధలు అనుభవించాం.. కరెంట్ కోసం ధర్నాలు, మంచినీటి కోసం కష్టాలు చూశాం.. అనుభవించాం. ఇప్పుడు అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి.. క్షణం పాటు కరెంట్ పోని పరిస్థితి తీసుకొచ్చామన్నారు.. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా మార్చామని ప్రకటించిన సీఎం.. న్యూయార్క్, లండన్, పారిస్‌లో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్‌లో మాత్రం కరెంట్ పోదు.. అలాంటి అద్భతమైన నగరంగా తయారు అవుతోందని వెల్లడించారు..
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్పెట్టాం.. గొప్ప గొప్ప పరిశ్రమలు హైదరాబాద్‌కు వస్తున్నాయి.. పరిశ్రమల రంగంలో రాష్ట్రం దూసుకుపోతోందని తెలిపారు కేసీఆర్… అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ కష్టాలు తీర్చాం.. ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు సడలించడంతో నిర్మాణం రంగం పుంజుకుంది. ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. రెండో రన్ వే కూడా వస్తుందని.. ఆ విధంగా ఈ మెట్రో రైలు కనెక్టివీటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసుకుని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు సీఎం కేసీఆర్.. అయితే, ఇప్పుడు హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యింది మెట్రో రైల్.. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో విస్తరించడం.. నిజంగా బిగ్ న్యూస్.. ఓఆర్ఆర్ తర్వాత.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరాయి.. మరికొన్ని ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మాణంలో ఉన్నాయి.. ఇక, ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైల్ వస్తే.. హైదరాబాద్ రూపురేఖలే మారిపోవడం ఖాయం.