ఓల్డ్‌ సిటీలో అట్లుంటది మరి.. బిర్యానీ విషయంలో అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్‌..

0
1022

బిర్యానీ వ్యవహారం ఇప్పుడు హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీలో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. అర్ధరాత్రి వరకు హోటల్స్‌ తెరిచి ఉండాలంటున్నారు ఎంఐఎం నేతలు.. దీనిపై ఇప్పటికే సిటీ పోలీస్‌ కమిషనర్‌ను కూడా కలిశారు.. అయితే, ఓల్డ్‌ సిటీలో కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు హోటల్స్‌ తెరిచి ఉంటున్నాయట.. మరికొన్ని రాత్రి 11 గంటలకే మూత పడుతున్నాయి.. ఇంకా కొన్ని హోటల్స్‌ చాటుమాటుగా.. అర్ధరాత్రి వరకు బిర్యానీ, ఇతర విక్రయాలు కొనసాగిస్తూనే ఉన్నాయి అనేది ఓపెన్‌ సీక్రెట్‌.. అయితే, బిర్యానీ పంచాయితీ అర్ధరాత్రి హోం మంత్రి వరకు వెళ్లింది.. అర్ధరాత్రి హోంమంత్రి మహమూద్‌ అలీకి ఓ ఫోన్‌ వచ్చింది.. ఈ టైంమ్‌లో ఫోన్‌ వచ్చిందంటే.. ఏదైనా అత్యవసరం ఏమో అన్నట్టుగా.. ఫోన్‌ తీశారట హోంమంత్రి… అయితే, తీరా చూస్తే.. అది బిర్యానీ వ్యవహారం.. అసలు ఎన్ని గంటల వరకు హోటళ్లు తెరిచిఉంచాలో చెప్పాలని అవతలి వ్యక్తి అడగడంతో మహమూద్‌ అలీకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక తలపట్టుకున్నారట.

ఫోన్‌ చేసిన వ్యక్తిని కాస్త గట్టిగానే మహమూద్‌ అలీ మందలించినట్టు తెలుస్తోంది.. నేను హోంమంత్రిని.. వంద టెన్షన్లు ఉంటాయన్న ఆయన.. అర్ధరాత్రి ఫోన్‌ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు.. కాస్త టైం తీసుకుని.. రాత్రి 11 గంటలకే హోటల్స్ మూసేస్తారని తెలిపారు మహమూద్‌ అలీ.. మరోవైపు అర్ధరాత్రి వరకు బిర్యానీ విక్రయాలకు అనుమతి కోసం.. ఇప్పటికే హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ను కలిశారు ఎంఐఎం నేతలు.. కానీ, ఇప్పటికే ఏ సమయానికి హోటల్స్‌ మూసివేయాలి అనే దానిపై మాత్రం క్లారిటీ లేదట… కానీ, ఇప్పుడు మాత్రం బిర్యానీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది. అట్లుంటది మరి.. హైదరాబాద్‌ బిర్యానీ ప్రియులు అంటే అంటున్నారు నెటిజన్లు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here