‘బ్రో’లో స్పూఫ్ సీన్‌.. మంత్రి అంబటి ఘాటు రియాక్షన్‌

0
58

BRO Movie: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తన అల్లుడు సాయిధర్‌ తేజ్‌తో కలిసి నటించిన ‘బ్రో’ సినిమా శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఈ సినిమా పవన్‌ ఫ్యాన్స్‌లో జోష్‌ పెంచింది.. సముద్రఖని దర్శకత్వం వహించగా.. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తన మార్క్‌ డైలాగ్‌లను అందించారు. అయితే, ఈ సినిమాలో పొలిటికల్‌ సెటైర్లు, కొన్ని స్పూఫ్‌ సీన్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. సినిమాలో ఫిలాసఫీ, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు పొలిటికల్‌ పంచ్‌లు పవన్‌ కల్యాణ్‌ పేల్చారని ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.. అయితే, ఈ బ్రో సినిమాలో స్పూఫ్‌ సీన్‌పై సోషల్‌ మీడియా వేదికగా పంచ్‌లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. ఇంతకీ సినిమాలో ఉన్న ఆ స్పూఫ్ సీన్‌ ఏంటి? మంత్రి స్పందించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే వివరాల్లోకి వెళ్తే..

బ్రో సినిమాలో మంత్రి అంబటి రాంబాబును పవన్ కల్యాణ్ టార్గెట్‌ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.. ఈ సినిమాలో అంబటి డాన్స్ పై సెటైర్లు వేశారు.. సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి రాంబాబు వేసిన స్టెప్పులను సినీ నటుడు పృథ్వీతో ఇమిటేట్ చేసిన సీన్ లో పవన్ పంచులు వేశారు.. ఈ చిత్రంలో శ్యాంబాబు పేరుతో 30 ఇయర్స్‌ పృథ్వీ నటించారు.. ఇక, సంక్రాంతి సంబరాల్లో అంబటి ఎలాగైతే డాన్స్‌ చేశారో, ఎలాంటి దుస్తులు ధరించారో.. అదే మేకోవర్‌తో పృథ్వీ కనిపిస్తారు.. పబ్‌లో పాటకు హుషారుగా.. సంక్రాంతి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు వేసినట్టుగానే డాన్స్‌ చేస్తూ ఉంటారు. అయితే, జోష్‌లో డ్యాన్స్‌ చేస్తున్న పృథ్వీని.. పవన్‌ కల్యాణ్‌ ఆపి.. శ్యాంబాబు ఆ డాన్స్‌ ఏంటి? వస్తున్న టెంపో ఏంటి? నువ్వు చేస్తున్న స్టెప్‌ ఏంటి? తకిటతకిటత 68, తకదిమితకదిమిత 24 అంటూ చేసిన సన్నివేశం నెట్టింట వైరల్‌ అయిపోయింది.. ఇక, సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి చేసిన డాన్స్‌ వీడియోను.. బ్రో సినిమాలో పృథ్వీవి డ్యాన్స్‌ చేసిన వీడియో.. పవన్‌ డైలాగ్‌లను మిక్స్‌ చేసి వైరల్‌ చేస్తున్నారు. అంతేకాదు దీనిపై విపరీతంగా మీమ్స్‌ క్రియేట్‌ చేశారు..

అయితే, బ్రో సినిమాలో ‘శ్యాంబాబు’ క్యారెక్టర్‌.. ఆ స్పూఫ్ సీన్‌పై కాస్త ఘాటుగానే సోషల్‌ మీడియాలో స్పందించారు మంత్రి అంబటి రాంబాబు.. ”గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి !” అంటూ చురుకలు అంచిన మంత్రి.. నేరుగా తన ట్వీట్‌ను పవన్‌ కల్యాణ్‌ను ట్యాగ్‌ చేశారు.. ఇక, మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌పై కూడా భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.. కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు.. మంత్రి డ్యాన్స్‌తో పాటు.. బ్రో సినిమాలో ఉన్న ఆ సీన్‌ను ట్వీ్‌ట్ చేస్తున్నారు. మొత్తంగా రాజకీయాల్లోనూ కాదు.. సినిమాల్లోనూ పవన్‌ కల్యాణ్‌.. పొలిటికల్‌ సెటైర్లు వేస్తున్న విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here