శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభ వేదికగా మంత్రి అంబటి రాంబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆయన సంబరాల రాంబాబు అంటూ సెటైర్లు వేశారు.. అయితే, పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి అంబటి రాంబాబు.. నన్ను టార్గెట్ చేస్తే నేలకు కొట్టిన బంతిలా ఎగిరి పడతానన్న ఆయన.. జనసేన నాపై బురద చల్లడం ఇంతటితో ఆగదు.. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తారు.. అయినా నేను భయపడను, నేను ధర్మాన్ని నమ్ముకుని వెళ్తున్నవాడినన్నారు.. పవన్ ఆవేశపరుడు , జ్ఞానం లేనివాడు.. ఒక కామెడీ పీస్ అంటూ ఎద్దేవా చేశారు.. పవన్ జన సైనికుల పేరుతో అమాయకులను రెచ్చగొడుతున్నాడని విమర్శించారు.. తల్లిని దూషించిన వారిని క్షమించను అన్న వ్యక్తి వాళ్ల సంకే ఎక్కి కూర్చున్నాడని సెటైర్లు వేశారు.. పవన్ ప్యాకేజీకి అమ్ముడు పోయే వ్యక్తి.. జనసైనికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. అసలు, వైసీపీ నాయకులు టార్గెట్ చేసే స్థాయి పవన్ కి లేదన్నారు అంబటి రాంబాబు..
వాస్తవాలు మాట్లాడే మంత్రులందరినీ జనసేన, టీడీపీ టార్గెట్ చేసిందని దుయ్యబట్టారు అంబటి రాంబాబు.. పవన్ సభలో ఓ క్లారిటీ వచ్చింది.. పవన్ ఒక్కడినే పోటీ చేయలేనని ఒప్పుకున్నాడు.. చంద్రబాబుతో పొత్తు లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడని.. ఒక్కడినే వెళ్తే వీర మరణం అంటున్నాడని.. నాకు దైర్యం ఎక్కువ అని చెప్పుకున్న పవన్.. జగన్ ను చూస్తే భయపడుతున్నాడని వ్యాఖ్యానించారు.. మీరు ఒంటరిగా వెళ్లినా ఇద్దరు కలసి వెళ్లినా మీకు ఓటమి తప్పదు అని జోస్యం చెప్పారు.. సినిమా నటుడని ప్రజలు వస్తున్నారు… కానీ, పవన్ ఒక కామెడీ పీస్ అని అర్థపోయిందన్నారు.. సంస్కారం అని చెప్పుకుని మంత్రులను ఒరేయ్ తురెయ్ అనీ దూషిస్తున్నాడని మండిపడ్డారు.. సంబరాల రాంబాబు అని మాట్లాడుతున్న వ్యక్తికి, మంత్రులను దూషిస్తున్న పవన్ కు సంస్కారం ఉందా? అని ప్రశ్నించారు.. పవన్, నాగ బాబు పిరికి సన్నాసులు అని కామెంట్ చేసిన ఆయన.. అమాయక యువతను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ లాంటి వాళ్ల మీద పవన్ అరుపులు.. ఏనుగు కుక్క సామెతను గుర్తుచేస్తుందన్నారు అంబటి రాంబాబు.. ప్యాకేజీ స్టార్ అంటే గొంతు పిసికి చంపేస్తాడా? లేక మంత్రులందరినీ భోజనంలో విషం పెట్టీ చంపేస్తారా..? అని ప్రశ్నించారు.. రాజకీయాల్లో గ్యారంటీ కార్డులు అడిగి పోటీ చేయడం ఏంటో అర్దం కావడం లేదని సెటైర్లు వేశారు.. ఇంగిత జ్ఞానం లేని పవన్, ప్యాకేజీ తీసుకున్న మాట వాస్తవం… జనసైనికులను రెచ్చ గొట్టి పబ్బం గడుపుతున్నాడు.. జగన్ మోహన్ రెడ్డి కష్టంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నాడు.. ప్రజలను గ్యారంటీ కార్డు అడగలేదు.. ఇలాంటి చీడ పురుగులకు రాష్ట్ర రాజకీయాల్లో స్థానం లేదని మండిపడ్డారు.. నువ్వు ఎవడితో కలసి వచ్చిన మీకు ఓటమి తప్పదని హెచ్చరించారు. అమ్ముడు పోయే తాపత్రయం తప్ప అభివృద్ధి గురించి మాట్లాడే విధానం పవన్ కి లేదన్నారు.. రాజకీయాల్లో సీనియర్ లు గా ఉన్న మాకు పవన్ లాంటి వ్యక్తి గురించి మాట్లాడటం బాధ కలిగిస్తుందని.. చంద్రబాబు మనుషులను జనసేనలో చేర్చి పోటీ చేపించాలన్న ఆలోచనలో పవన్, చంద్రబాబు ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి అంబటి రాంబాబు..