పరిటాల రవి గుండు కొడితే పవన్ కల్యాణ్ బెదిరిపోయాడు.. మేం నిజంగా బెదిరిస్తే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరగగలడా? అని ప్రశ్నించారు. తాజాగా, పవన్ చేసిన వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కామెంట్లపై ఘాటుగా స్పందిస్తున్నారు ఆ పార్టీ నేతలు.. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్… పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో పుట్టిన రోజు నాడు చిరంజీవికి వేదన మిగులుస్తున్నారన్నారు.. కొణిదెల పవన్ కల్యాణ్ అనాలో.. నారా, నాదెండ్ల పవన్ కల్యాణ్ అనాలో కూడా అర్ధం కావడం లేదన్న ఆయన.. మెగాస్టార్ కుటుంబంలో అమ్ముడిపోయే వ్యక్తి ఉన్నందుకు బాధపడుతున్నాం.. పవన్ కల్యాణ్ చర్యల వల్ల చిరంజీవి అభిమానులుగా మేం తీవ్ర వేదనలో ఉన్నామంటూ ఫైర్ అయ్యారు.
ఇక, అమిత్ షా వేరే నటుడి (జూనియర్ ఎన్టీఆర్)తో సమావేశం అయితే… పవన్ కల్యాణ్ జీర్ణించుకోలేకపోతున్నట్టు కనిపిస్తోందంటూ సెటైర్లు వేశారు మంత్రి అమర్నాథ్.. మూడు రోజులుగా పొలిటికల్ కాల్షీట్ లతో పవన్ కల్యాణ్ బిజీగా వున్నారని ఎద్దేవా చేశారు.. సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పైన, వైసీపీ ప్రభుత్వం పైన పవన్ కల్యాణ్ పిచ్చిమాటలు చూస్తుంటే.. చంద్రబాబుతో డీల్ కుదిరిందని అర్ధం అవుతోందన్నారు.. ఇక, చంద్రబాబు వల్ల, చంద్రబాబు కోసం, చంద్రబాబు చేత ఏర్పాటు చేయబడ్డ పార్టీ జనసేన అని ఆరోపించిన ఆయన.. జనసేన, టీడీపీ నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకున్నారని వ్యాఖ్యానించారు.. కళ్లుండీ కాబోదిగా మారితే ఏమని చెప్పగలం… రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు లంచం తీసుకున్నట్టు, బెదిరింపులకు పాల్పడినట్టు నిరూపించగలవా..!? అంటూ సవాల్ విసిరారు.. పరిటాల రవి గుండు కొడితే బెదిరిపోయింది పవన్ కల్యాణ్ అని విమర్శించారు. మేం నిజంగా బెదిరిస్తే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరగగలడా? అని ప్రశ్నించారు. ఎప్పటికీ మూడు రాజధానులపై మా విధానంలో మార్పు లేదని స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.