కొడితే కొట్టాలి.. సిక్స్ కొట్టాలి.. క్రికెట్ ఆడిన మంత్రి హరీష్ రావు

0
1334

మంత్రి తన్నీరు హరీష్ రావు లైఫ్ స్టయిల్ విభిన్నంగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ఆటవిడుపు మరిచిపోరు. సిద్దిపేట జిల్లాలో అయితే ఎక్కడ క్రికెట్ పోటీ జరిగినా ఆయన బ్యాట్ పట్టుకోవాల్సిందే. తాజాగా గురువారం హరీష్ రావు క్రికెట్ ఆడారు. కొడితే కొట్టాలిరా.. సిక్స్ కొట్టాలిరా అన్న రీతిన బ్యాట్ పట్టి దుమ్మురేపారు. సిద్దిపేటలోని జయశంకర్ స్టేడియంలో వెటరన్స్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. అక్కడికెళ్ళిన హరీష్ రావు తనలోని క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు.

క్రికెట్ మ్యాచ్ లో బ్యాట్ పట్టారు మంత్రి హరీష్ రావు, ఆయనకు తోడయ్యారు మరో మంత్రి నిరంజన్ రెడ్డి. బౌలింగ్ కూడా వేసిన ఇద్దరు మంత్రులు అక్కడ క్రీడాకారులను అలరించారు. క్రికెట్ మ్యాచ్ లో విజేతలకు బహుమతులు అందజేశారు మంత్రులు. దీంతో అక్కడ సందడి నెలకొంది. మంత్రులు క్రికెట్ ఆడిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. అట్లుంటాది మాతో అంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేస్తున్నారు. మంత్రులా మజాకా.. రాబోయే ఎన్నికల్లోనూ మా ఆట ఇలాగే ఉంటుందంటూ కామెంట్లు విసురుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here