చంద్రబాబు అధికార దాహం, ప్రచార పిచ్చి వల్లే అమాయక ప్రజల మరణాలు సంభవిస్తున్నాయని విమర్శించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్.. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీలో 40 మందిని పొట్టన పెట్టుకున్నాడని మండిపడ్డారు.. ఇంత మంది మరణాలకు కారణం అయిన చంద్రబాబుపై అసలు ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని నిలదీశారు.. గుంటూరులో తొక్కిసలాట ఘటనపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి జోగి రమేష్.. చంద్రబాబును అరెస్టు చేస్తామని ప్రకటించారు. ఇక, చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు.. ఉయ్యూరు ఫౌండేషన్ లాంటి చంద్రబాబు మసాలా ఫౌండేషన్ లపై విచారణ చేస్తామని వెల్లడించారు. మరోవైపు.. చంద్రబాబును డీజీపీ కట్టడి చేయాల్సిందే నని సూచించారు మంత్రి జోగి రమేష్.
మరోవైపు.. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొడాలి నాని.. యమ రథంతో చంద్రబాబు ప్రజలను చంపుతున్నాడని విమర్శించారు. ఏడాది చివర ఎనిమిది మందిని, ప్రారంభంలో ముగ్గురిని బలుగొన్న నరరూప రాక్షసుడు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. శని గ్రహాన్ని మించిన జామాతా దశమగ్రహం చంద్రబాబు.. ఆయన పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. అంతేకాదు, చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని డిమాండ్ చేశారు కొడాలి నాని. మొదలు ,చివర తెలియని ఎన్నారైలు నిర్వహించిన ఇలాంటి కార్యక్రమానికి బుద్దున్నవాళ్లు ఎవరూ వెళ్లరని వ్యాఖ్యానించారు కొడాలి నాని.. తమనేరాన్ని పోలీసులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. టీడీపీ సభలకు సూచనలు చేస్తే, పోలీసులు తమపై ఆంక్షలు విధిస్తున్నారని గగ్గోలు పెడతారని.. నూటికి నూరు శాతం చంద్రబాబు పిచ్చి తోనే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు. ప్రతి ఎన్నికలో ఎవరో ఒకరి కాళ్లు పట్టుకొని గెలవడమే చంద్రబాబుకు తెలుసు, స్వయంగా ఆయన గెలవడం కల అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి కొడాలి నాని.