చంద్రబాబుపై సీబీఐ విచారణ దమ్ముందా.. కాకాని సవాల్

0
1022

నెల్లూరు కోర్టులో జరిగిన చోరీపై సిబిఐ విచారణకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి విదేశాల్లో ఆస్తులు.. బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు వైసిపి నేత కాకాని గోవర్ధన్ రెడ్డి కొన్ని పత్రాలు విడుదల చేయడం..అవి నకిలీవని పోలీసుల విచారణలో వెల్లడింది. కోర్టులో కేసు విచారణలో ఉన్న దశలోనే సాక్షాలు చోరీ కావడం పై హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది.ప్రస్తుతం ఈ అంశం పై సిబిఐ విచారణకు అదేశించడాన్ని టిడిపి..వై.సి.పి.నేతలు స్వాగతిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సింగపూర్. మలేషియా. హాంకాంగ్ ..బ్యాంకాక్ లలో వ్యాపార లావాదేవీలు ఉన్నాయని అక్కడ బ్యాంకులలో ఖాతాలు తెరిచారని ఆరోపించారు. అంతేకాకుండా ఆయన ఆస్తులు విలువ వెయ్యి కోట్లు ఉంటుందని కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. దీనికి సంబంధించి 20 పత్రాలను విడుదల చేశారు..2016వ సంవత్సరం డిసెంబర్ 23న కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణలు సంచలనం కలిగించాయి. కాకాని ఆరోపణలపై కంగు తిన్న సోమిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. విదేశాలలో బ్యాంకు ఖాతాలు.. వ్యాపారాలు తనకు లేవని స్పష్టం చేశారు. కాకాని విడుదల చేసిన పత్రాలు నకిలీవని వీటిపై న్యాయపోరాటం చేస్తానని ఆయన ప్రకటించారు.

తన పరువుకు నష్టం కలిగించిన కాకానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ జరిపి ఆ పత్రాలు నకిలీవని తేల్చారు. అంతేకాకుండా కాకాని గోవర్ధన్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా ఆయనతో సంప్రదింపులు జరిపిన వారిని విచారించి నలుగురిని నిందితులుగా తేల్చారు. ఏ1 కాకాణి గోవర్ధన్ రెడ్డి ని తమిళనాడుకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణి మోహన్ …వెంకట కృష్ణన్.. హరిహరన్ .లను ఇతర నిందితులుగా చేర్చారు. కాకాణి అరెస్ట్ వారెంట్ ఇవ్వడంతో ఆయన సుప్రీంకోర్టు కు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు నిందితులు..నకిలీ స్టాంపులు పత్రాలు రూపొందించారని గుర్తించారు . వీరిని అదుపులోకి తీసుకొని నకిలీ పత్రాలకు ఉపయోగించిన లాప్ టాప్.. ప్రింటర్.. హార్డ్ డిస్క్.. సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని నాలుగవ అదనపు జ్యూడిషల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 13న కోర్టులో చోరీ జరిగింది. ఈ చోరీలో కాకాని. కేసుకు సంబంధించిన సాక్షాధారాలు ఉన్న బ్యాగును దుండగులు తీసుకెళ్లారు. దొంగతనాలకు శిక్షలు విధించే కోర్టులోనే చోరీ జరగడంపై హైకోర్టు స్పందించింది. అంతేగాక ఇనుము దొంగతనానికి వచ్చిన దొంగలను కుక్కలు తరమడంతో కోర్టులోకి వెళ్లి దాక్కున్నారని..అక్కడి బీరువాలలోని బ్యాగ్ లను తమ వెంట తీసుకువెళ్లారని జిల్లా పోలీసులు విచారణలో తేల్చారు. దీంతో ఈ అంశాన్ని సుమోటోగా తీసుకుని హై కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో తన ప్రమేయం లేకున్నా.. తనపై టిడిపి నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సిబిఐతో విచారణ జరపాలని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కేసును పరిశీలించిన హైకోర్టు ఈ చోరీ విషయంపై సిబిఐతో విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here