కేటీఆర్‌ పాప్‌ క్విజ్‌.. నడ్డా చెప్పులు మోసేది ఎవరు?

0
546

బీజేపీ జాతీయ చీఫ్‌ జేపీ నడ్డా తెలంగాణలో పర్యటన వేళ.. మంత్రి కేటీఆర్‌ చేసిన సెటైరికల్‌ ట్వీట్‌ వైరల్‌గా మారిపోయింది.. ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్న నడ్డా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌లో మహిళా క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మిథాలీరాజ్‌తో సమావేశం అయ్యారు.. ఇక, రాత్రికి సినీ హీరో నితిన్‌తో భేటీకానున్నారు.. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ముగింసభలో ఆయన పాల్గొననున్నారు.. అయితే, విపక్షాలపై, ముఖ్యంగా బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో ముందుండే తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్.. ఇప్పుడు నడ్డా పర్యటనను ఉద్దేశిస్తూ చేసిన సెటైరికల్‌ ట్వీట్‌ వైరల్‌గా మారిపోయింది..

మునుగోడు బహిరంగ సభ కోసం తెలంగాణ వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. హైదరాబాద్‌లో మహంకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే.. అయితే, అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. పరుగు పరుగు వెళ్లి.. అమిత్ షాకు చెప్పులు అందించారు.. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌గా మారిపోయింది.. బండి సంజయ్‌కు కొందరు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు మండిపడుతూ ట్వీట్లు చేశారు.. టీఆర్‌ఎస్‌తో పాటు, కాంగ్రెస్‌ నేతలు కూడా బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు.. ఇప్పుడు బీజేపీ జాతీయ చీప్‌ జేపీ నడ్డా పర్యటన సమయంలో.. టైమింగ్‌ చూసి.. “పాప్ క్విజ్.. ఈరోజు జేపీ నడ్డా చెప్పులు మోసే గులాం ఎవరు..? దీనికి తీవ్రమైన పోటీ ఉంటుందని కచ్చితంగా అనుకుంటున్నాను” అంటూ ఒక నవ్వు సింబల్‌తో చేసిన సెటైరికల్ ట్వీట్.. ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, కేటీఆర్‌ ట్వీట్‌కు స్పందిస్తున్న నెటిజ్లు ఇంకా ఎవరు? బండి సంజయేనని కొందరు..! ధర్మపురి అరవింద్‌ అని మరికొందరు..! సెటైర్లు కాదు.. సమస్యల సంగతి ఏంటని ఇంకా కొందరు రిప్లై ఇస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here