ఏ రాష్ట్రానికైనా వస్తా.. నిరూపించూ.. రాజీనామా చేస్తా, రాజకీయ సన్యాసం స్వీకరిస్తా..

0
901

తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌, విపక్ష బీజేపీ మధ్య.. మాటల యుద్ధంతో పాటు సవాళ్ల పర్వం కొనసాగుతూనే ఉంది.. తాజాగా చెప్పుతో కొట్టుకునే వ్యాఖ్యలు రచ్చ చేస్తున్నాయి.. ఇప్పుడు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మంత్రి మల్లారెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బహిరంగ సవాల్‌ విసిరారు.. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన ఆయన కుటుంబ సభ్యులపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు.. ఈ రాష్ట్రంలో జరిగినట్లుగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి పథకాలు చూపించిన నేను రాజీనామా చేస్తాను అంటూ బండి సంజయ్‌కి చాలెంజ్‌ విసిరారు మల్లారెడ్డి.. ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ తరహా పథకాలు చూపిస్తే మంత్రి , ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏ రాష్ట్రానికి రమ్మంటే ఆ రాష్ట్రానికి వస్తా.. రైతులకు కేసీఆర్‌ ప్రభుత్వం చేసినంత మేలు చేసిన ప్రభుత్వాన్ని చూపించు అంటూ సవాల్‌ విసిరారు..

కాగా, మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాల్‌పై స్పందిస్తూ.. బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. తాను చెప్పు దెబ్బలు తినడానికి సిద్దమే అంటూ సవాల్ విసిరారు. కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి ఆ తర్వాత చెప్పుతో కొట్టుకోవడానికి.. కొట్టించుకోవడాని సిద్ధమన్న ఆయన.. కేసీఆర్ కుటుంబంపై వస్తున్న అవినీతి ఆరోపణల నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకే ఈ నాటకాలంటూ ఫైర్ అయ్యారు.. తండ్రి తల నరికినా.. కొడుకు చెప్పుతో కొట్టినా ప్రజల ప్రయోజనాలకోసం భరించడానికి రెడీగా ఉన్నానని నిన్న బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.. ఇక, ముందుగా డ్రగ్స్ కేసు విషయంలో బండి సంజయ్ చేసిన సవాల్‌కు గట్టిగా కౌంటర్‌ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. టెస్ట్ కు నేను రెడీ.. నా రక్తం, బొచ్చు, కిడ్నీ ఇస్తా.. చిత్తశుద్ధితో వస్తాను.. కరీంనగర్ సెంటర్‌లో చెప్పుతో కొట్టుకోవడానికి బండి సంజయ్ సిద్ధంగా ఉన్నాడా అని కేటీఆర్‌ సవాల్‌ విసిరిన విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here