మిమ్మల్ని ప్రజలు వద్దంటున్నారు.. బీజేపీపై మండిపడ్డ మంత్రి ప్రశాంత్ రెడ్డి

0
699

నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) మీడియా సమావేశంలో బీజేపీపై విరుచుకుపడ్డారు. హోంమంత్రి అమిత్ షా సికింద్రాబాద్ సభతో ప్రజలు ఎవరి వైపో తేట తెల్లం అయిపోయిందన్నారు. గజిని మహ్మద్ కంటే ఎక్కువగా బిజెపి నేతలు తెలంగాణ (telangana) పైదండ యాత్ర చేస్తున్నారు.. అసలెవరు వీరు.ఇతర రాష్ట్రాలకు ఎందుకు పోవట్లేదు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. పోరాటాలు తెలంగాణకు కొత్త కాదు..ఇక్కడి ప్రజలు గాజులు తోడుక్కోలేదు.. బీజేపీ నేతలు జీవిత కాలం ఢిల్లీ గద్దెపై ఉండరు.

కేంద్ర మంత్రులు వచ్చి రేషన్ షాపుల్లో గొడవలు పెడుతున్నారు. ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉందని ప్రధాని మోడీ గమనించాలి. గిరిజన బంధుపై రాష్ట్రపతి స్పందించాలి. తెలంగాణ వజ్రోత్సవాలు సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు ఘనంగా జరుగుతుంటే ,ఇతర రాష్ట్రాల నుండి దండయాత్రలు చేస్తున్నారు..అసలు వారికి తెలంగాణ చరిత్ర నేపథ్యం గురించి ఏం తెలుసు..? కేసీఆర్ ను తప్ప ఇతరులను ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 న బీజేపీ నేతలు సికింద్రాబాద్ లో హడావిడి చేసిన సంగతి తెలిసిందే.

అమిత్ షా పై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చని రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకు వచ్చారా..? ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలో అధికారికంగా సంబరాలు జరుగుతుంటే రాజధాని నడిబొడ్డున పోలీసుల కవాతు దేనికి సంకేతం..? దేశంలో ఎక్కడైనా ఇట్లా జరిగిందా…? ఎక్కడ లేనిది తెలంగాణలోనే ఎందుకు..? కేంద్ర బీజేపీ మంత్రులు,నేతలు తెలంగాణ మీద గజిని మహ్మద్ లా దండెత్తి వస్తున్నారు.

కేసిఆర్ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలు సూటిగా ప్రశ్నిస్తున్నారు కాబట్టే తెలంగాణ మీద దండ యాత్రకు వస్తున్నారా? ఎందరినో ఎదిరించిన పోరాటాల గడ్డ ఇది. మీ జులుంను తెలంగాణ ప్రజలు సహించరు . కేంద్ర బీజేపీ వైఖరి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు..భారత ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధం..అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు..బీజేపీ కి రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు… అది గుర్తెరిగి ప్రవర్తిస్తే మంచిది. మా సభకు బఠాణీలు అమ్ముకోవడానికి వచ్చినంత మంది కూడా మీ పోలీసు కవాతు సభలో లేరన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here