ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి. పొత్తు పొడుపులు.. విమర్శలు.. పెదవి విరుపులు.. విమర్శలు.. ఇవే ఏపీలో నడుస్తున్నాయి. మంత్రి రోజా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. పవన్ డైమాండ్ రాణి మాటకు రోజా కౌంటర్ వేశారు. అది కూడా మామూలుగా కాదు.. కాస్త వెటకారంగా. పవన్ కల్యాణ్ పొలిటికల్ జోకర్ అనేశారు రోజా సెల్వమణి. జగన్ లా నేను పోటీ చేయలేను.. నాకు చేత కాదు అని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నాడన్నారు. అదీ జగన్ పవరంటే అన్నారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టలేనని నిస్సహాయత వ్యక్తం చేశారన్నారు. సంక్రాంతికి చిరంజీవి వాల్తేరు వీరయ్య కలెక్షన్లు వచ్చాయి… బాలయ్య వీరసింహారెడ్డి కలెక్షన్లు వచ్చాయి…పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నుండి కలెక్షన్లు అందాయి…కాని జనసేన నాయకులే ఎమీ లేకుండా పోయింది. సిఎం జగన్ పరిపాలనలో రైతులందరికి సంతోషంగా పండుగ జరుపుకుంటున్నారు. మంత్రిగా తొలి సంక్రాంతి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
మరోవైపు మంత్రి రోజా టీడీపీ పైన హాట్ కామెంట్స్ చేశారు. జీవో 1 కాపీలు తగలబెట్టడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. పవర్ కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలు తీస్తాడు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి, సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.పనికిమాలిన స్టేట్ మెంట్లు ఇస్తున్నాడన్నారు. జగన్ ప్రతి హామీ నెరవేర్చారన్నారు. జగన్ కు ప్రజలు అండగా ఉంటారు తప్ప, మామకు, కుప్పం ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి కాదన్నారు మంత్రి రోజా.