జగన్ ను ఓడించే మగాడు ఇంకా పుట్టలేదు

0
21

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి బూస్ట్ ఇచ్చాయనే చెప్పాలి. అయితే ఏపీ మంత్రులు మాత్రం ఈ ఎన్నికలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. 108 నియోజకవర్గాల్లో ప్రజలు మిమ్మల్నే గెలిపించారు అని చంద్రబాబు అంటున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు మాదే హవా అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. అదే నిజం అయితే‌..నా సవాలును స్వీకరించాలన్నారు మంత్రి ఆర్ కె రోజా. అచ్చెన్నాయుడు, బాలకృష్ణ , చంద్రబాబు తమ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి చూపించాలి. చనిపోయే ముందు నోట్లో తీర్థం పోసినట్లు పూర్తిగా ఓడిపోయే టీడీపీకి గ్రాడ్యుయేట్లు తీర్థం పోశారు.

తీర్థం పోస్తే పోయే వాళ్ళు ప్రశాంతంగా వెళతారని నమ్మకం వుంది. పులివెందులలో జగన్ ను ఓడించే మగాడు ఇంకా పుట్టలేదు.వై నాట్ పులివెందుల అని నాగబాబు అనటం పెద్ద జోక్. సొంత గడ్డ పైనే అన్నదమ్ములు నాగబాబు , పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఓడిపోయారు…మొదటి సారి టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ల్లో పోటీ చేశాం. ఈ ఎన్నిక విధానం వేరు. ఇప్పుడు వచ్చిన అనుభవంతో వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరుతాం అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వర రావు మాట్లాడుతూ.. టిడిపి మూడింటి గెలుపుని చూసి జబ్బలు కొట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు టిడిపిని లాక్కున్నారు.

ప్రజల నుంచి వచ్చిన పార్టీ వైఎస్సార్ సిపి…వైఎస్ జగన్ తన కష్టంతో పార్టీ స్ధాపించారు. కుళ్లు కుతంత్రాలతో గెలిచే వ్యక్తి చంద్రబాబు. ఈ గెలుపు చూసి జబ్బలు చురుచుకోవద్దు. నంద్యాల ఎన్నికలు చూసి విర్రవీగిపోయారు. ఆ తర్చాత మాకు పట్టం‌కట్టారు. ఈ ఎన్నికలలో మూడు గెలిచి విర్రవీగవద్దు..వచ్చే ఎన్నికలలో మళ్లీ మేమే గెలుస్తాం. సంక్షేమ పధకాలని చూసి మళ్లీ ప్రజలు మాకు పట్టం‌ కడతారు. వచ్చే ఎన్నికలలో 175 కి 175 సీట్లు గెలిచి తీరతాం. చంద్రబాబు వయసు అయిపోయింది…ఆయన పని అయిపోయింది. మేము గెలిస్తే అక్రమాలా…వారు గెలిస్తే ప్రజాస్వామ్యంలో గెలిచినట్టా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here