జగన్ ని చంద్రబాబు ఏం పీకలేరు.. మంత్రి అప్పలరాజు

0
495

చంద్రబాబునాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. తనకు ఇవే చివరి ఎన్నికలన్న కామెంట్లపై ఘాటుగా స్పందించారు. జగన్ ని చంద్రబాబు ఏం పీకగలరన్నారు.తెలుగు దేశం పార్టీ రాజకీయ భవిష్యత్తును స్వయంగా చంద్రబాబే సమాధి కడుతున్నారు. బీజేపీ కూడా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తోంది. చంద్రబాబు రాజకీయ నిష్క్రియాత్మక పరిస్థితికి, చేతకాని తనానికి చివరి ఎన్నికలు అన్న వ్యాఖ్యలు నిదర్శనం. తీవ్రమైన ఫ్రస్టేషన్ కనిపిస్తోంది. రాజకీయం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతాడన్నారు.

చంద్రబాబు భార్య అయినా తనను రాజకీయాల్లోకి లాగొద్దని ఎందుకు వారించటం లేదో అర్థం కావటం లేదు. ఎందుకీ చేతకాని రాజకీయాలు??భార్యను అడ్డం పెట్టుకొని ఎంత కాలం చంద్రబాబు రాజకీయాలు చేస్తాడు? అంత హేయకరమైన చర్య ఇది. దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్. చంద్రబాబు చరిత్ర శనక్కాయలు దొంగతనం చేయటం దగ్గర నుంచి మొదలవుతుందన్నారు సీదిరి అప్పలరాజు.మరో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి చేశాడు? చంద్రబాబు క్రికెట్ టీం లో కోహ్లి లాంటి వాడు కాదు కదా. చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్స్‌ట్రా ప్లేయర్. చంద్రబాబుకు సత్తా ఉంటే 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పాలన్నారు. అలా చెప్పలేకపోతే 2024 ఎన్నికలే చంద్రబాబు చివరి ఎన్నికలు అవుతాయి. అధికారం కోసం భార్యను కూడా బజారుకు లాగుతున్నాడని విమర్శించారు మంత్రి అమర్నాథ్. కర్నూలు టూర్ లో చంద్రబాబు ఎమోషన్ అయిన సంగతి తెలిసిందే. మీరు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపకపోతే ఇవే తనకు చివరి ఎన్నికలన్నారు చంద్రబాబు. ఆయన కామెంట్లపై వైసీపీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here