తెలంగాణ జిల్లాల్లో ఖమ్మం చాలా హాట్. అక్కడ ఏ పరిణామాలు సంభవిస్తాయో ఎవరూ ఊహించలేరు. ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కార్యకర్తల కోసం అవసరమైతే కర్ర పట్టుకొని ముందు ఉంటానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం గువ్వలగూడం గ్రామంలో ఈ వ్యాఖ్యలు చేశారు ఈ గ్రామంలో ముందు నుంచి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి తందాల ఉపేందర్ రెడ్డి వర్గానికి వివాదాలకు కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు గువ్వల గూడెం గ్రామంలో సభలో మాట్లాడుతూ మనం కూడా అరాచకం చేయాలంటే ఒకటే నిమిషం పని మీ మీద ఎవరైనా దాడి చేయడానికి వస్తే నేను కర్ర పట్టుకొని ముందుంటా అన్నారు.
మనకి ఆ అవసరం లేదు కానీ మన మీద ఎవరైనా దౌర్జన్యానికి పాల్పడితే నేను మీకు అండగా ఉంటా అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలకి సహకారం చేస్తూ ఉందాం కానీ మన మీదికి ఎవరైనా వస్తే మాత్రం దానికి ప్రతీకారం కూడా ఉంటుందని అన్నారు.
గ్రామంలో ఏమన్నా వివాదాలు ఉంటే ఆ కేసుల్ని వెంటనే పరిష్కారం చేయాలని వేదిక మీద నుంచి సిఐ కి mla కందాల ఉపేందర్ రెడ్డి సి ఐ కి ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.