అసత్యాలను అంకెలతో అల్లుతున్న చిదంబరం అంటూ మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మాజీ ఆర్థికమంత్రి చిదంబరంపై మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. నిన్న రాజ్యసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యుడు పి.చిదంబరం సభలో పేర్కొన్న కొన్ని విషయాలపై విజయసాయి రెడ్డి వివరణ కోరారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన 2013 నవంబర్‌లో దేశంలో ద్రవ్యోల్బణం కనీవినీ ఎరుగని రీతిలో 19.93 శాతానికి చేరిన విషయాన్ని ఎలా దాచి పెడతారని ప్రశ్నించిన విజయసాయు రెడ్డి. యూపీఏ 1 (2004-09 మధ్య) సగటు ద్రవ్యోల్బణం 5.8 శాతం, యూపీఏ 2 (2009-20014)లో 10.4 శాతం ఉండగా ప్రస్తుతం అది 4.7 శాతం మాత్రమే ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.
మొత్తం పన్నుల ఆదాయ వసూళ్ళలో కార్పొరేట్ టాక్స్ వాటా గణనీయంగా తగ్గిందన్న చిదంబరం ఆరోపణపై మాట్లాడుతూ, 2018-2020 మధ్య మొత్తం పన్నుల వసూళ్ళలో కార్పొరేట్ టాక్స్ 32 శాతం ఉన్న విషయాన్ని చిదంబరం విస్మరించారు. కోవిడ్ కారణంగా కుదేలైన పారిశ్రామిక రంగానికి ఉపశమనం కల్పించేందుకే ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్‌ను తగ్గించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అలాగే, జీడీపీ వృద్ధి ఎందుకు రెట్టింపు కాలేదన్న చిదంబరం ప్రశ్నకు జవాబిస్తూ…2014లో ఆర్థిక మంత్రిగా చిదంబరం నిష్క్రమించే నాటికి జీడీపీలో దేశం ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. తదనంతరం, ఈ తొమ్మిదేళ్ళ కాలంలో దేశ జీడీపీ ప్రపంచ దేశాల్లో 5వ స్థానంకు చేరిందని చెబుతూ అసత్యపు అంకెలతో సభను తప్పుదారి పట్టించేందుకు చిదంబరం ప్రయత్నిస్తున్నారంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు.