మునుగోడులో కొనసాగుతున్న పోలింగ్

0
896

మునుగోడు ఉప ఎన్నిక ఫీలింగ్ ఓటింగ్ కొనసాగుతుంది. ఉత్సాహంగా ఓటర్లు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నిన్న జరిగిన ఘటనల పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. .నాన్ లోకల్ వాళ్ళు ఇంకా మునుగోడు లో ఉన్నారని ఫిర్యాదు అందింది.రెండు గ్రామాల్లో ఎన్నికల సిబ్బంది ఇతరుల దగ్గర నుండి డబ్బులు, కొన్ని వస్తువులు పట్టుకున్నారు. 2 పొలింగ్ స్టేషన్ లలో evm బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది సెట్ చేశాము. ఆ రెండు evm లు పని చేస్తున్నాయి. 298 పొలింగ్ స్టేషన్లలో ప్రశాoతంగా పోలింగ్ జరుగుతుంది. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ పరిస్థితులు గమనిస్తున్నా అన్నారు వికాస్ రాజ్.

మరోవైపు తనపై ఫేక్ ప్రచారం సాగుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. ఒక ఆడపిల్లను ఎదుర్కొనలేక బిజెపి నేతలు కుట్రలు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పార్టీ మారానని ప్రచారం చేస్తున్న వారి పైన ఈసీకి పిర్యాదు చేస్తాను..బీజేపీ నేతల కుట్రనే ఇది..కాంగ్రెస్ శ్రేణులు..మునుగోడు ప్రజలు పూర్తిగా గమనించాలి. అమ్ముడు పోయే వారే. ఈ ప్రచారం చేస్తున్నారు.. కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాను. కాంగ్రెస్ లోనే ఉంటానన్నారు. అధికారంలో ఉన్న రెండు పార్టీలో సామాన్యుల పైనా కూడా దాడులు చేస్తున్నాయి..ఒక్క ఆడపిల్లను ఎదుర్కొనే లేక ఈ ప్రచారం చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాళ్ళను గుర్తించాలి అంటున్నారు పాల్వాయి స్రవంతి.

మునుగోడులో 50 మంది సర్వీసు ఓటర్లు వున్నారు.199 మంది మైక్రో అబ్జర్వర్లు వున్నారు. అన్ని బూత్ లలో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటుచేశారు. 5 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు వున్నారు. మొత్తం 2 లక్షల 41 వేల 855 మంది ఓటర్లు వున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది.యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం పుట్టపాక ఫంక్షన్ హాల్ లో వేరే ప్రదేశాల నుండి వచ్చిన వారు ఫంక్షన్ హాల్ లో ఉన్నారని తెలుసుకున్న అబ్జర్వర్….అక్కడ సామాగ్రి, డబ్బులు పట్టుకున్నారు అబ్జర్వర్ సమత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here