టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు

0
719

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై హత్యకు కుట్ర పన్నిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఆయన హత్యకు ఓ వ్యక్తి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఆర్మూర్‌కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం అందుతోంది. తన భార్య లావణ్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతోఆమె భర్త కక్ష పెంచుకున్నాడని.. అందుకే ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో స్పష్టమవుతోంది.

కాగా కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరగడంతో ఎమ్మెల్యే సిబ్బంది పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు రంగంలోకి దిగి అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద కత్తి, ఒక పిస్టోల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడిని పూర్తిస్థాయిలో విచారిస్తున్నామని.. అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here