Nagababu-Narayana: నాగబాబు కూడా తక్కువేం “తినలేదు”.. నారాయణకు మించి..

0
939

Nagababu-Narayana: చిరంజీవి తమ్ముడు నాగబాబు సీపీఐ నారాయణను క్షమించాలని మెగా జన సైనికులకు సూచించాడు. నారాయణ పెద్ద వయసును దృష్టిలో ఉంచుకొని ఆయనను ట్రోల్‌ చేయటం మానుకోవాలని కోరాడు. తప్పు పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తే క్షమించి వదిలేయటం ధర్మమని అన్నాడు. దీంతో నారాయణ-నాగబాబు ఎపిసోడ్‌కి ఇక తెరపడినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే నాగబాబు కూడా తక్కువేం “తినలేదని”, ‘నారాయణకు మించి’న స్థాయిలో పరుషంగా స్పందించాడనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నాగబాబు చెప్పినట్లు నారాయణ వయసులో పెద్దోడు.

అంతేకాదు. మెగా ఫ్యామిలీ మాదిరిగా పార్ట్‌ టైమ్‌ పాలిటిక్స్‌ చేయకుండా దశాబ్దాలుగా పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నాడు. పైగా పాలిటిక్స్‌ కోణంలోనే విమర్శలు చేశాడు. ఆ మాటకొస్తే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వీళ్లిద్దరిలో ముందుగా నాగబాబే వెటకారం చేశాడు. ‘ఆ సభలో మా అన్నయ్య చిరంజీవి తప్ప అందరూ అద్భుతంగా పెరఫార్మెన్స్‌ చేశారు. ఆ మహానటులందరికీ ఇదే నా అభినందనలు’ అని సెటైర్లు వేశాడు. ఈ నేపథ్యంలో నారాయణ కామెంట్స్‌ కరెక్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

also read: Interesting News: బర్రెతో బస్‌ షెల్టర్‌ ప్రారంభోత్సవం. గ్రామస్తులు ఇలా ఎందుకు చేశారంటే?..

ఎందుకంటే ‘ఆ ప్రోగ్రామ్‌ వేదిక మీద సూపర్‌ స్టార్‌ కృష్ణను కూర్చోబెడితే అల్లూరి సీతారామరాజునే చూస్తున్న సంతృప్తిని జనం పొందేవాళ్లు’ అన్న ఆయన ఒపీనియన్‌ వంద శాతం నిజమనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీ, సీఎం జగన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి రోజా.. వీళ్లందర్నీ మహానటులంటూ నాగబాబు ఎద్దేవా చేయటం ఎంత వరకు సమంజసమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందిన సంగతి నిజం కాదా అని అడుగుతున్నారు.

మంత్రిగా పదవీ కాలం ముగియగానే హస్తం పార్టీకి ఆమడ దూరంగా ఉండటాన్ని ప్రస్తావిస్తున్నారు. చిరంజీవి కేంద్ర మంత్రి పదవి కోసమే తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారనేది దీన్నిబట్టి రుజువవుతోందని పొలిటికల్‌ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల విషయానికొస్తే కొన్నాళ్లు టీడీపీతో, కొన్నాళ్లు బీజేపీతో, మధ్యలో కమ్యూనిస్టులతో, ఎన్నికల సమయంలో బీఎస్పీతో కలిసి నడిచాడు. ఎప్పుడు ఏ పార్టీతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తాడో తెలియని పరిస్థితి. నారాయణ కూడా ఈ విషయాలనే చెప్పాడు.

అంతమాత్రానికే నాగబాబు “గడ్డి, చెత్తాచెదారం తింటున్నాడు. తిండిపెడితే మనిషిలా ప్రవర్తిస్తాడు” అంటూ నారాయణపై హార్డ్‌గా రియాక్ట్‌ కావటం సరికాదని తటస్థులు హితవు పలుకుతున్నారు. నాగబాబు వ్యవహారం చూస్తుంటే తన కుటుంబాన్ని అసలు ఎవరూ విమర్శించకూడదనే మెంటాలిటీతో ఉన్నట్లు కనిపిస్తోందని చెబుతున్నారు. నారాయణ చెప్పినట్లు రాజకీయాల్లో విమర్శలు సహజం. కాకపోతే భాషా దోషం లేకుండా చూసుకోవాలి. అయినా భాష కాదు భావం ముఖ్యమని కేసీఆర్‌ ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు. ఏదిఏమైనప్పటికీ తన వైపు నుంచి తప్పు జరిగినట్లు నారాయణ ఒప్పుకున్నాడు. మరి నాగబాబు కూడా ఆ “గడ్డి” లాంగ్వేజ్‌ వాడినందుకు సారీ చెబుతాడా అనేది కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here