కోయంబత్తూరు కారు బ్లాస్ట్‌ కేసులో స్పీడ్‌ పెంచిన ఎన్‌ఐఏ.. 45 ప్రాంతాల్లో సోదాలు

0
394

దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోన్న కోయంబత్తూరు కారు బ్లాస్ట్‌ కేసులో విచారణ వేగవంతం చేసింది ఎన్‌ఐఏ.. ఏకకాలంలో తమిళనాడులోని 45 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.. అర్ధరాత్రి నుంచి 150 మంది అధికారులతో 45 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు విస్తృత తనిఖీలు కొనసాగిస్తున్నారు.. చెన్నై, కోయంబత్తూరు సహా ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది ఎన్‌ఐఏ.. కోయంబత్తూరు సిలిండర్ కారు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా.. పేలుడుకు సంబంధించిన అనుమానితులు, మద్దతుదారుల ఇళ్లపై ఎన్ఐఏ దాడులు జరుపుతోంది. చెన్నైలోని పుదుపేట్, మన్నాడి, జమాలియా, పెరంబూర్‌లో దాడులు నిర్వహిస్తున్నారు.. కోయంబత్తూర్‌లోని కొట్టైమేడు, ఉక్కడం, పొన్‌విజా నగర్ మరియు రథినపురి సహా పలు ప్రాంతాల్లో సోదాలు సాగుతున్నాయి..

కాగా, కోయంబత్తూరు కారు పేలుడు కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ద్వారా జాతీయ దర్యాప్తు సంస్థ అక్టోబర్ 27న దర్యాప్తు చేపట్టింది. కాగా, అక్టోబర్ 23న తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో తమిళనాడులోని కోయంబత్తూరులో మారుతీ 800 కారులో ఎల్‌పీజీ సిలిండర్ పేలింది. కొట్టాయ్ ఈశ్వరన్ దేవాలయం సమీపంలో పేలుడు సంభవించింది, ఈ ఘటనలో జమేజా ముబిన్ అనే 25 ఏళ్ల వ్యక్తి మరణించారు.. భారతదేశం యొక్క ప్రథమిక కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్స్‌గా పనిచేస్తున్న ఎన్‌ఐఏ.. రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తోంది… ఈ కేసులో ఉన్న లింక్‌లను వెతికేపనిలో పడిపోయింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here