Bhavani island..No Tourists: అరకొర సదుపాయాలు.. భవానీద్వీపానికి రాని పర్యాటకులు

0
813

విజయవాడలోని భవానీద్వీపం అంటే తెలియని వారు ఉండరు… కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలు ఇక్కడ పర్యాటకం కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంది.. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడం… మరోవైపు భవానీద్వీపంకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది.. అయితే పర్యాటకులకు వినోదాన్ని మాత్రం అందించటంలో కాస్త వెనుకంజలో వుందనే చెప్పాలి. విజయవాడ అంటే ఆధ్యాత్మిక రంగానికి పెట్టింది పేరు.. మరోవైపు నగరానికి కృష్ణనది అదే రీతిలో పర్యాటకానికి వన్నె తెస్తుంది..కృష్ణ నదికి ఆనుకుని వున్న భవానిద్వీపం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.

గత రెండేళ్ల కిందట కోవిడ్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటక రంగం పూర్తిస్థాయిలో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రస్తుతం ఇప్పుడిపుడే ఈ రంగం గడిన పడుతుంది.. కార్తీకమాసం అంటేనే పర్యాటకులు ఎక్కడెక్కడ మంచి పర్యాటక ప్రాంతాలు వుంటాయో అనే వెతికే పరిస్థితి….ఇలాంటి ప్రదేశాల్లో చూడచక్కని ప్రాంతం భవనిద్వీపం… నగర ప్రజలతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి సైతం ఒక్కసారైనా భవనిద్వీపం చూడాలని ఆశా పడుతారు. ప్రస్తుతం కార్తీకమాసం కావటంతో భవానీద్వీపనికి పర్యాటకుల రద్దీ సైతం అధికమైంది.. ఇదంతా బాగనే వున్న భవనిద్వీపంలో మాత్రం అరకొర సౌకర్యాలే కనిపిస్తున్నాయి.. పర్యాటకులకు వినోదాన్ని పంచే బోటింగ్, వాటర్ స్పోర్ట్స్ అంతంత మాత్రంగానే కనిపిస్తున్నాయి.పున్నమి ఘాట్ నుంచి బోట్ సౌకర్యంతో భవనిద్వీపానికి చేరుకున్నాక పర్యాటకులు సరైన వినోదం లేక ఉసూరుమంటూ వెనక్కి రావాల్సిన పరిస్థితి….

భవానీద్వీపంలో భారీగా పిచ్చిమొక్కలు దర్శనం ఇస్తున్నాయి. పర్యాటకులకు సరైన సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఎక్కువ కృష్ణనదిలో భోట్ పై విహరించాలానే కోరిక వుంటుంది. కానీ ఆ పరిస్థితి ఇక్కడ లేదు. ఒకప్పుడు కార్తీకమాసంలో వాటర్ స్పోర్ట్స్ తో కళకళడిన కృష్ణనది ప్రస్తుతం వెలవెలబోతుంది. కోట్లాది రూపాయల విలువైన మరబోట్లు మూలన పడ్డాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లు కృష్ణనదిలో బోటింగ్ నిలిపివేయటం, కృష్ణ నదికి వరుసగా వరద ప్రవాహం రావటంతో… ఒకప్పుడు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచిన కృష్ణనదిలో బోట్ల సందడి ఇప్పుడు లేకపోవటం పర్యాటకులను నిరాశ పరుస్తోంది.

భారీ క్రుయిజర్, మేకనైజ్డ్, స్పీడ్ బోట్లు, పారాసైలింగ్ వంటి బోట్లు మూలనపడ్డాయి. ప్రస్తుతం కార్తీకమాసం కావటంతో పర్యాటకుల తాకిడి పెరిగిన… వీటిని ఉపయోగంలోకి తెచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.. కృష్ణనదికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది.. మరోసారి భవనిద్వీపంలో మరుగున పడిన వాటర్ స్పోర్ట్స్, బోటింగ్, వంటి సదుపాయాలను వినియోగంలోకి తీసుకురావాలని, తద్వారా ఇక్కడ పర్యాటకం మరింతా అభివృద్ధి చెందుతుందని అంటున్నారు ఇక్కడకి వచ్చే పర్యాటకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here