ప్రధాని నరేంద్ర దామోదర్ మోడీ 72వ జన్మదినోత్సవం ఇవాళ. దేశవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు. ఇదిలా వుంటే.. ప్రధాని మోడీ బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఇవాళ ప్రధాని మోడీ పుట్టిన రోజు కి నిరసనగా యూత్ కాంగ్రెస్ వినూత్న నిరసన తెలిపారు. జాతీయ నిరుద్యోగ దినోత్సవం గా మోడీ బర్త్ డే ని జరిపిన యూత్ కాంగ్రెస్ చార్మినార్ దగ్గర చీపుర్ల తో ఊడ్చి నిరసన తెలిపింది. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిస్తున్న కేంద్రం తీరుపై మండిపడ్డారు.
సమోసాలు అమ్ముతూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ సేనా రెడ్డి నిరసన తెలిపారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి మోసం చేసిన మోడీ జన్మదినాన్ని జాతీయ నిరుద్యోగ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందన్నారు. అందుకే చార్మినార్ వద్ద రోడ్లు ఉడ్చి,సమోసాలు అమ్ముతూ నిరసన తెలియజేశామన్నారు. ఇప్పటికైనా దేశప్రజలు మోడీ మోసాలను గమనించాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు NSUI.. బీజేపీ వల్లభాయ్ పటేల్ తన మనిషి అని చెప్పుకునే ప్రయత్నానికి నిరసనగా NSUI పాలాభిషేకం చేసింది.