టీడీపీ నేత నారా లోకేష్ పై మండిపడ్డారు పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ. నారా లోకేష్ ట్విట్స్ చూసి బాగా అసహనంతో ఉన్నట్టు కనిపిస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలకి మంచి పేరు ఉంది. వీడియో పెట్టే ముందు అందులోని విషయాలు వాస్తవమా కాదా అని తెలుసుకోవాలి. 14 ఏళ్లు ముఖ్యమంత్రి గా ఉండి నీ తండ్రి ఎం నేరిపారో నాకు అర్ధం కావట్లేదన్నారు.
మధుసూదన్ అనే అతను పెద్దిరెడ్డిపై విమర్శలు చేశారు. ఆయన పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జి బాబు ప్రధాన అనుచరుడన్నారు వెంకటే గౌడ. కర్ణాటకలో సెల్ టవర్ ఉపకరణాలు దొంగతనాలు చేసిన ఇతను అరెస్ట్ అయ్యారు. రాజకీయంగా లోకేష్ అన్నీ కోల్పోయారు. గత ఎన్నికల్లో నువ్వు మంగళగిరిలో ఓడిపోయవ్, ఈసారి మీ నాన్న కుప్పంలో ఓడిపోవడం ఖాయం అన్నారు. ఎలానో మీకు ఇక్కడ ఇల్లు కూడా లేదు కాబట్టి మీరు రాష్ట్రం వీడి వెళ్ళిపోతారు
దొంగను తీసుకొచ్చి పెద్దిరెడ్డి కుటుంబం పై విమర్శలు చేయడం న్యాయమా? క్వాలిటీ లేని పాలు పోయడం వలన శ్రీజ డెయిరీ పాలు వద్దు అని చెప్పింది. అనంతరం, తెలిసి తెలియకుండా మాట్లాడను అని అదే మధుసూదన్ ఒప్పుకున్నారు…. ఒక వీడియో విడుదల చేశారు. లోకేష్ ను అందరూ ఎందుకు పప్పు అంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. మీ నాన్నకు నువ్వు పుట్టడం ఆయన దురదృష్టం అన్నారు ఎమ్మెల్యే వెంకటే గౌడ.